మరో క్రేజీ సినిమాతో వస్తున్న దుల్కర్ సల్మాన్.. ఆ మూవీ విశేషాలివే!

ప్రముఖ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ హీరో నటించిన బాలీవుడ్‌ మూవీ ‘చుప్’ కూడా పలు రికార్డులను తిరగరాసింది. కాగా ఇప్పుడు అలాంటి మరొక అదిరిపోయే మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దుల్కర్ సిద్ధమయ్యాడు. ‘కింగ్ ఆఫ్ కోతా’ అనే మూవీకి ఇటీవలే ఈ హీరో సైన్ చేశాడు. ఈ సినిమాపై భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకులకు ఇది ఏం ఆఫర్ చేయనుంది? ఈ మూవీ విశేషాలు ఏంటి? తెలుసుకుందాం.

ఇప్పటి వరకు క్లాస్ పాత్రలలోనే యాక్ట్ చేసిన దుల్కర్ కింగ్ ఆఫ్ కోతా సినిమాలో మాత్రం మాస్ అవతార్‌లో కనిపించి కేక పుట్టించనున్నాడని సమాచారం. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ నిన్ననే మధురైలో ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ ఇదే ప్రాంతంలో జరగనుందని వినికిడి. ఇప్పటికే ఈ మూవీ కోసం రాయపురంలో ఓ భారీ సెట్ సైతం ఏర్పాటు చేశారట. అభిలాష్ జోషి డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తోనే ఈ సినిమా రూపొందుతోంది. దుల్కర్ తన సొంత బ్యానర్‌ “వేఫారెర్ ఫిల్మ్స్” పతాకంపై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడని టాక్.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా స్టోరీ ఏంటనేది తెలిసిపోయింది. ఈ మూవీ స్టోరీ కోతా సామ్రాజ్యానికి కింగ్‌గా పిలవబడే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందట. ఆ రోల్‌ దుల్కర్ చేయగా.. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో యాక్ట్‌ చేయనున్నాడని సమాచారం. సమంత హీరోయిన్‌గా నటించవచ్చు. ఐశ్వర్యా లక్ష్మి కూడా ఒకరోజు చేయనుందని సమాచారం. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిమిష్ రవి చేపట్టనున్నాడు. షాన్ రెహమాన్ సంగీత బాణీలు సమకూరుస్తున్నాడు. ‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమా చారిత్రక కథ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమాతో దుల్కర్ హిట్ కొడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.