ఒక్క చిత్రాన్ని 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?

టాలీవుడ్ లో కోలీవుడ్లో స్టార్ హీరోలలో సూర్య కూడా ఒకరు. ఇక సూర్య నటించిన సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ లో సూర్యకు ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం గజిని సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో సూర్య ,ఆసిన్ జంటగా నటించారు.ఈ చిత్రని డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.2005 లో ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ దగ్గర పేను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఆ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం.

Ghajini Stills Pictures | nowrunning
ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో తెరకెక్కించడం జరిగింది మురగదాస్. ఈ చిత్రంలో సంజయ్ రామస్వామిగా సూర్య ఎంతో అద్భుతంగా నటించారు . ఆసిన్ కూడా అద్భుతమైన నటన కనబరిచింది. ఇక నయనతార కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా హరీష్ జయరాజ్ అందించిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇలా అన్నిటినీ కలుపుకొని ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. అయితే ఈ సినిమా వచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Ghajini Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Ghajini  Movie - FilmiBeat
అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమానీ 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ముందుగా డైరెక్టర్ మురుగదాస్.. మహేష్ బాబు వెంకటేష్ కమలహాసన్, రజనీకాంత్ ,పవన్ కళ్యాణ్, మాధవన్ విజయ్ కాంత్, విజయ్ తదితర హీరోలు ఈ సినిమా కథను సున్నితంగా రిజెక్ట్ చేశారట. చివరిగా అజిత్ హీరోగా ఈ సినిమాకు ఒప్పుకొని సేట్స్ మీదికి వెళ్లాలనుకున్న సమయంలో.. రెండు బిజీ షెడ్యూల్ కారణం చేత నిర్మాతలకు హీరోకి మధ్య విభేదాలు రావడంతో ఈ సినిమాని వదిలేసారని సమాచారం. ఇక దీంతో తమిళంలో అప్పుడప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్య ఈ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు.