“జల్సా” రీ రిలీజ్.. వ‌ర‌ల్డ్ వైడ్ ఆల్ టైం రికార్డ్‌.. ప‌వ‌న్ ప‌వ‌న్ ఇది…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల సినిమాలలో వారికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలను వారి పుట్టినరోజులు..లేదా ఇత‌ర‌ సందర్భాల్లో మళ్లీ రిలీజ్ చేయటం అనేది ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే క్రమంలో మహేష్ బాబు పుట్టినరోజుకు సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాకు అదిరిపోయే కలెక్షన్ అందించారు. పోకిరి రీ రిలీజ్‌లో దుమ్ము రేపేసే వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Jalsa will have its re-release bigger than Pokiri - ybrantnews.com

ఇప్పుడు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు ఆయన సినిమాల్లో సూపర్ హిట్ అయిన జల్సా సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయటాని సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే భారీ రికార్డులు క్రియేట్ చేసింది. జ‌ల్సా సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 థియేటర్లో రీ రిలీజ్ అవుతోంది.

Stage set for Jalsa's special shows | 123telugu.com

ఇది ఆల్టైమ్ రికార్డ్ సెట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు చెపుతున్నారు. అయితే ఈ సినిమా పోకిరి సినిమా కలెక్షన్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జ‌ల్సాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయ‌గా… దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పవన్ కళ్యాణ్ కి జోడిగా ఇలియానా నటించింది. పార్వ‌తీ మెల్ట‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Share post:

Latest