ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన సమంత.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

అందల కుందనపు బొమ్మ సమంత ..తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీనీ ఓ ఊపు ఊపేసిన బ్యూటి. ఏమాయ చేశావే సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుస భారీ సినిమాలతో క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే, సమంత నగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ..సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది. నచ్చిన్నట్లు చేస్తూ..ఇష్టం వచ్చిన్నట్లు ఉంటూ ..హాట్ ఫోటో షూట్లు చేస్తూ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.


కాగా, రీసెంట్ గా తన విడాకుల పై కాఫీ విత్ కరణ్ షో లో సంచలన విషయాలను బయటపెట్టింది సామ్. తమ విడాకులు ఏం సామరస్యంగా జరగలేదని చెప్పిన ఆవిడ..కనీసం చైతన్య ను భర్త అని కూడా పిలిపించుకోవడానికి కూడా ఇష్ట పడలేదు. అంతేకాదు, తమ విడాకులకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు కూడా బయటపెట్టింది. ఇదే ఇప్పుడు సమంత మెడకు చుట్టుకుంది. నిజానికి సమంత నాగ చైతన్య విడిపోయేటప్పుడు..ఇద్దరు అంగీకారంతోనే ఓ అగ్రిమెంట్ రాసుకున్నారట.

ఇద్దరు టాప్ సెలబ్రిటీలు కావడంతో..విడాకులు గురించి ఎవరు ఎక్కడ ఏ ఇంటర్వ్యుల్లో మాట్లాడిన,,ఇద్దరు వ్యక్తిగత దూషణలకు వెళ్లకూడదని..తమ మధ్య జరిగిన దాని బయట పెట్టుకుని..ఇద్దరు పరువు తీసుకోకుడదని..ఆ అగ్రిమెంట్ లో రాసుందట. ఈ అగ్రిమెంట్ ప్రకారం..సమంత, నాగ చైతన్య..తమ విడాకుల మ్యాటర్ ఎక్కడ ఎత్తకూడదు. ఒక్కవేళ్ళ ఎత్తిన ఆన్సర్ పక్క వాళ్ళు నెగిటివ్ అయ్యేలా ఆన్సర్ చేయకూడదు. కానీ, సమంత రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో అన్ని విషయాలు బయటపెట్టేసింది..నాగ చైతన్య ను నెగిటివ్ చేసింది. దీంతో ఇప్పుడు సమంత లీగల్ గా ప్రాబ్లమ్‌స్ ఫేస్ చేయబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఏది ఏమైన సమంత తన మాటలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు.