‘ ఖిలాడి ‘ కి క‌ళ్లు చెదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్‌… ర‌వితేజ రేంజ్ ఇంత

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ క్రాక్ హిట్ త‌ర్వాత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. క్రాక్ క‌రోనా టైంలో కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో పాటు ర‌వితేజ కెరీర్‌కు చాలా రోజుల త‌ర్వాత మాంచి ఊపు తెచ్చింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ర‌వితేజ వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ర‌వితేజ న‌టించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి. రాక్ష‌సుడు సినిమా త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ర‌వితేజ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్‌తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు చెపుతున్నారు. ర‌వితేజ మార్కెట్ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే ఇది చాలా ఎక్కువ‌. అయితే నిర్మాత‌ల‌కు నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ద్వారా చాలా వ‌ర‌కు రిక‌వ‌రీ అయిపోయింది.

ఇక ట్రైల‌ర్ వ‌చ్చాక ఖిలాడిపై అంచ‌నాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక‌ ఏరియాల వారీగా ఖిలాడి అయితే సాలిడ్ బిజినెస్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నారు. ఒక్క నైజాంలోనే ఏకంగా రు. 8 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని టాక్ ? నైజాంలో ర‌వితేజ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ అంటే మామూలు విష‌యం కాదు. 11న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ఖిలాడి ర‌వితేజ ఫామ్‌ను కంటిన్యూ చేస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.


Leave a Reply

*