వ‌కీల్‌సాబ్‌ను మించి టాప్ లేపుతోన్న భీమ్లానాయ‌క్ ప్రి రిలీజ్ బిజినెస్‌..!

టాలీవుడ్‌లో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే చాలు రిలీజ్‌కు ముందు రోజు నుంచే తెలుగునాట పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప‌వ‌న్ మూడేళ్ల పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి వ‌కీల్ సాబ్‌.. అది కూడా బాలీవుడ్ పింక్ రీమేక్‌లో న‌టిస్తేనే దుమ్ము రేపేసింది. అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి.

అయినా కూడా వ‌కీల్‌సాబ్ వ‌సూళ్లు దుమ్ము రేపాయి. అదే టైంలో ఏపీలో టిక్కెట్ల ఇష్యూ రాకుండా ఉండి ఉంటే వ‌కీల్‌సాబ్ వ‌సూళ్ల మోత మోగిపోయి ఉండేది. వ‌కీల్‌సాబ్ త‌ర్వాత యేడాది గ్యాప్ తీసుకుని ప‌వ‌న్ చేస్తోన్న సినిమా భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుట్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న భీమ్లానాయ‌క్ వ‌కీల్‌సాబ్ ప్రి రిలీజ్ బిజినెస్‌ను క్రాస్ చేసేసింది.

వ‌కీల్‌సాబ్ రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఇప్పుడు భీమ్లానాయ‌క్ ప్రి రిలీజ్ బిజినెస్ రు. 100 కోట్లు దాటేసిన‌ట్టు చెపుతున్నారు. భారీ మాస్ ఎంటర్టైనర్ తో పవన్ వస్తుండగా దీనికి మాత్రం సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే హిట్ అయిన స‌బ్జెక్ట్ కావ‌డంతో పాటు ఇటు మ‌రో హీరో రానా ద‌గ్గుబాటి కూడా ఉండ‌డం, త్రివిక్ర‌మ్ మాట‌లు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి.

పాట‌లు కూడా హిట్ అవ్వ‌డ‌తో భీమ్లానాయ‌క్ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌న్న అంచ‌నాలు ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి.