తారక్ కోసం కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బొమ్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లకు పైగా అయ్యింది. దీంతో తమ అభిమాన హీరో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తారక్‌లోని నట విశ్వరూపాన్ని మరోసారి ప్రపంచానికి చూపించేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ కూడా చేశాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నించినా కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ఈ సినిమా వాయిదా పడింది.

- Advertisement -

ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా చూస్తుండగానే తారక్ తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే తారక్ కోసం కొరటాల ఎలాంటి కథను రెడీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా గతంలో తారక్‌తో కొరటాల జనతా గ్యారేజ్ అనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అంతకు మించిన హిట్ కొట్టాలని కొరటాల అండ్ టీమ్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడట కొరటాల. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో తారక్‌కు ఓ బాబాయ్ ఉంటాడని.. అయిత ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి అందరిలో నెలకొనగా.. ఈ పాత్రలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తే నిజం అయితే అసలు రాజశేఖర్, తారక్ మధ్య వచ్చే సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది చాలా రేర్ కాంబో అని.. ఇలాంటిదే నిజం అయితే తారక్ ఫ్యాన్స్ సంతోషిస్తారని పలువురు సినీ క్రిటిక్స్ అంటున్నారు. అయితే ఇది తారక్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో పక్కనబెడితే, రాజశేఖర్‌కు మాత్రం అదిరిపోయే బూస్టప్ ఇచ్చినట్లే అవుతుందని చెప్పాలి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular