మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..?

తాజాగా మా ఎన్నికల ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడు. తర్వాత ప్రకాష్ రాజు ఫైనల్ సభ్యులు 11 మంది రాజీనామా చేసి సమర్పించారు. ఇక విష్ణు నాతో పని చేయడం ఇష్టం లేదని అందుకోసమే మెము ఈ రాజీనామాను చేశామని అన్నట్లుగా తెలియజేశారు.

అయితే తాజాగా వీరందరూ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి కొన్ని ఘాటు వ్యాఖ్యలు తెలియజేసింది. తను మా కార్యాలయం ఎదుట ఆందోళన చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని.. తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని వాపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ తమకు అన్యాయం జరిగిందని రోడ్డుపైకి వచ్చి ముక్క పెట్టి ఏడుస్తున్నారు అని తెలియజేస్తుంది.

అందరితో రాము రాజీనామాలు సమర్పించిన మూల సూత్రధారులు ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ కు సేవ చేస్తానని అంటున్నారు. ఎవరు సేవ చేస్తే ఏమిటి..? మంచు విష్ణు పై ప్రకాష్ రాజ్ కు ఏడుపు ఎందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ను గెలిపించేందుకు చిరంజీవి,పవన్ కళ్యాణ్ నాగబాబు ఎన్ని ఎత్తులు వేసినా అవి జరగలేదు. అంతే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఏలుతున్న రాజ్యం పోయిందని అందుకని ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారని ఆమె తెలుపుకు వస్తోంది.

ఇక తనను గతంలో మా కార్యాలయం ముందు తన పరువు తీసిన నాగబాబు, జీవిత, హేమ తో సహా కొందరు వ్యక్తులు తనను ఏడిపించారాని .. ఇక ఇప్పుడు వారే అసోసియేషన్ పరువు తీస్తున్నారు అని ఆమె విమర్శించింది. దాసరి తరువాత స్థానాన్ని భర్తీ చేయగల సమర్ధత కేవలం మోహన్బాబుకి ఉందని వివాదాస్పదంగా వాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Share post:

Latest