భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన అఖిల్..ఈసారైనా స‌క్సెస్ అవుతాడా?

అఖిల్ అక్కినేని.. సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా కాల‌మే అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న మూడు చిత్రాలు చేశాడు. కానీ, ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. అఖిల్ హిట్ ముఖ‌మే చూడ‌లేక‌పోయాడు. ఇక ఈయ‌న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.

Akhil Akkineni and Pooja Hegde's Most Eligible Bachelor to hit the theatres on October 8 - Movies News

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. నేడు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ‌టంతో.. ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌దైన శైలిలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్టూ కొట్ట‌క‌పోయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం భారీగా బిజినెస్ చేసింది.

Note Down The Release Date Of 'Most Eligible Bachelor' - Bold Outline : India's leading Online Lifestyle, Fashion & Travel Magazine.

అవును, ఈ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో ఇప్పుడు ఈ మూవీ హిట్ అవ్వాలంటే రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మ‌రి భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన అఖిల్‌.. ఈ సారైనా స‌క్సెస్ అవుతాడో..లేదో..తెలియాల్సి ఉంది.