ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన అన్నాత్తే రైట్స్..?

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే ఈ సినిమాని దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ నేడు విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ 12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ లో పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ రేట్లను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ మార్కెట్ బాగా పడిపోయినట్లు కనిపిస్తోంది.

తెలుగులో రజనీకాంత్ గత సినిమాలు ఆడకపోవడం ఈ సినిమా రైట్స్ ఇంత తక్కువ రేటుకు అమ్ముడవ్వడానికి కారణం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటుగా కుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు డి ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ అన్నాత్తే సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.