చై- సామ్.. విడాకుల పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్..!

సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కువగా ముందు ఉంటున్నాడు. ఒక రాంగోపాల్ వర్మ ఈ మధ్య సినిమాల కంటే బోల్డ్ వీడియోస్ లోనే ఎక్కువగా తీస్తున్నాడు. ఇక పెళ్లి విషయం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జైలు లాంటిది. అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు అందుకే ఎవరి పెళ్లి చేసుకోకూడదు అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్ చేస్తున్నాడు.

- Advertisement -

ఇక ఇప్పుడు తాజాగా రాంగోపాల్ వర్మ పెళ్లి చేసుకున్న వారు డైవర్స్ తీసుకోవడం అంటే మహా పునర్జన్మ పొందినట్లే అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు ఎక్కువ వైరల్గా మారుతోంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో.. అలాగే విడాకులు తీసుకున్న అప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి చేసుకోవడం అనేది చావు లాంటిది విడాకులు అంటే మల్లి పునర్జన్మ వచ్చినట్లే అందుకే విడాకులను సంగీతం లాంటి పెద్ద ఫంక్షన్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలి, డ్యాన్సులు వేసి ఎంతో ఆనందంగా గడపాలి అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య సమంత విడిపోయిన తరువాత వెంటనే ఈ వీడియో ని వాడడం వల్ల చాలా హాట్ టాపిక్గా మారిపోయింది.

Share post:

Popular