భ‌య‌ప‌డ్డ స‌మంత‌..విడాకులు ప్ర‌క‌టించ‌గానే ఏం చేసిందో తెలుసా?

గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌లను నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్ర‌దాయాల ప్రకారం అంగ‌రంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరి వివాహ బంధానికి బీట‌లు వారాయి.

Naga Chaitanya Says It's 'Painful' To Read Headlines, Amid His And Samantha Prabhu's Divorce Reports

నిన్న త‌మ విడాకుల విష‌యాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం మాత్రం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే అటు అభిమానులు, ఇటు సినీ సెల‌బ్రెటీలు మాత్రం వీరి విడాకుల‌పై తీవ్ర నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.

Naga Chaitanya-Samantha divorce rumours: Actor finally breaks silence | Sambad English

ఇదిలా ఉంటే.. సమంత తన కామెంట్ల సెక్షన్‌ను ఎప్పుడూ క్లోజ్ చేయదు. కానీ, త‌న‌ విడాకుల విషయంలో కచ్చితంగా నెగిటివ్ కామెంట్లు వస్తాయని ముందే భ‌య‌ప‌డ్డ‌ స‌మంత‌.. విడిపోబోతున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే తన పోస్టుకు కామెంట్లను డిసెబుల్ చేసేసింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.