పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి చైత్ర రాయ్…?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి చైత్ర రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ భాషల్లో కూడా నటించింది. బుల్లితెరపై మనసున మనసై, ఒకరికొకరు, అష్టా చమ్మా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు ఇలా వినోద్ సీరియల్స్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే ఈమె సీరియల్స్ లో పీక్స్ లో ఉన్న సమయంలో ఇండస్ట్రీకి దూరమైన కుటుంబ బాధ్యతలను చేపట్టింది. ఇండస్ట్రీకి దూరమైన కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఆ మధ్య తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది చైత్ర రాయ్. ఇస్ ఎ బేబీ గర్ల్ ఇప్పటివరకు ఇలాంటి అనుభూతి ఎప్పుడు పొందలేదు అంటూ ఫోటోలు షేర్ చేసింది. అలాగే మా కుటుంబం అందరూ ఆనందంలో మునిగిపోయారు అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Share post:

Latest