“ఆర్ఆర్ఆర్ ‘ నిర్మాతను భయపెడుతున్న రాజమౌళి !

దర్శక దిగ్గజ ధీరుడు రాజమౌళి ఎన్నో విజయాలను చూసిన డైరెక్టర్ గా పేరు పొందాడు.ఆయన కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అనే పదం వినపడలేదు.కానీ ఈయన ఒక విషయంలో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటాడు.అది ఏమిటంటే సినిమా రిలీజ్ పై డేట్ ల విషయం లో ఈయన ఎప్పుడు క్లారిటీ మిస్ అవుతూనే ఉంటాడు.

RRR ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకి దాదాపుగా 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.పైగా ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా కావడం విశేషం. అందులో ఇద్దరు స్టార్ హీరోస్.ఇక రాజమౌళి సినిమా డేట్ చెప్తే మిగతా సినిమా నిర్మాతలు వారి సినిమాల డేట్ ను విడుదల చేయొచ్చుని ఆ నిర్మాతల అభిప్రాయం.కానీ రాజమౌళి తన సినిమా రిలీజ్ డేట్ చెప్పడు.మిగతా హీరోల సినిమాని రిలీజ్ చేసుకొని ఇవ్వడు.

మొన్నటి వరకు అక్టోబర్ 13న వస్తున్న అన్నారు. ఏటువంటి పోస్టర్లు విడుదల అయినా కూడా ఇదే రోజున సినిమా వస్తుందని విపరీతంగా ప్రచారం చేశారు.ఇక RRR సినిమా మా ఇప్పుడే విడుదల కాదు అనడంతో సంక్రాంతి బరి లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ను ప్రకటించుకున్నాయి.కానీ సినీ ఇండస్ట్రీలో వినికిడి ఏమిటంటే రాజమౌళి సంక్రాంతి సీజన్ పై కన్నుపడింది అన్నట్లుగా సమాచారం.

RRR సినిమాని రాజమౌళి సంక్రాంతికి విడుదల చేస్తారని తెలిసిన మిగతా సినిమాల నిర్మాతలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.ఎందుకంటే అంత పెద్ద సినిమాకి ఎవరు పోటీ గా వెళ్లాలి అనుకోరు.అందుచేతనే రాజమౌళిపై ఆయా నిర్మాతలు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక భవిష్యత్తులో కూడా ప్రతి పెద్ద సినిమా తనకు ఇష్టం వచ్చినట్లు డేట్స్ మార్చుకుంటే ఎలా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయాలపై ఏమన్నా నిబంధనలు పెడతారేమో వేచిచూడాల్సిందే.

Share post:

Latest