ఈ వారం థియేటర్లలో సంద‌డి చేయ‌నున్న‌ సినిమాలు ఇవే..!

సినీ ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది. షూటింగ్స్ ఆగిపోవ‌డ‌మే కాదు.. సినిమాలెన్నో విడుద‌ల కాలేక‌పోయాయి. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌స్తుండ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో మూత‌ప‌డిన థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. జూలై 30 నుంచి చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మ‌రి వాటిపై ఓ లుక్కేసేద్దాం ప‌దండి…

Nootokka Jillala Andagadu - song by Simha | Spotify

1. నూటొక్క జిల్లాల అందగాడు- శ్రీనివాస్‌ అవసరాల, రుహాని శర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్‌ రావు అనే కొత్త వ్య‌క్తి ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. బట్టతల చుట్టూ తిరిగే విభిన్నమైన కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కాబోతోంది.

Dear Megha Official Teaser | Adith Arun | Megha Akash | Sushanth Reddy |  Vedaansh Creative Works - YouTube

2. డియర్ మేఘ- మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు హీరోలుగా న‌టించిన ఈ చిత్రానికి సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన ఈ ట్రాజెడీ ల‌వ్ స్టోరి సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Appudu Ippudu: అప్పుడు ఇప్పుడు: చిన్న సినిమానే అయినా డేరింగ్ డిసీజన్..!  దిగ్గజ దర్శకుల సపోర్ట్‌తో.. - low budget movie appudu ippudu release date  fix | Samayam Telugu

3. అప్పుడు ఇప్పుడు- సుజన్‌, తనీష్క్‌ జంటగా చలపతి పువ్వల తెరకెక్కించిన ఓ చక్కటి వినోదాత్మక చిత్రమిది. శివాజీ రాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న‌ ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది.

Karthik's The Killer Movie Theatrical Trailer | Karthik Sai | DollySha |  Neha Deshpandey | Chinna - YouTube

4.ది కిల్లర్‌- చిన్నా దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కార్తీక్‌ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే కీలక పాత్రలు పోషించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సైతం సెప్టెంబ‌ర్ 3నే విడుద‌ల కాబోతోంది.