బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో ఎక్కువగా చాలా మంది హీరోలు స్టోరీలు నచ్చక, అందులోని క్యారెక్టర్ నచ్చక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా చేసే ముందు ఎవరు అంత అద్భుతాన్ని గుర్తించలేకపోయారు. ఈ సినిమాని దిల్ రాజు , భాస్కర్ కూడా అంతటి విజయం వస్తుందని ఊహించుకోలేదు.

సినిమా చేస్తుంటానని ఊహల్లోనే ఉంటారు. కానీ చిర స్థాయి వరకు మిగిలిపోయే ఇటువంటి ఒక అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు అని వాళ్ళకి అసలు తెలియదు. బొమ్మరిల్లు సినిమా విడుదలై దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈ సినిమా గొప్పతనం అటువంటిదట. ఇక ఈ సినిమా హిట్ తప్ప, ఇంక మరి ఏ సినిమాలు ఈ డైరెక్టర్ తీసిన కూడా ఫ్లాపులుగా మిగిలిపోయాయి.

ఇక అసలు విషయానికొస్తే, బొమ్మరిల్లు సినిమా కథను ఇద్దరు టాలీవుడ్ హీరోలు వదిలేసుకున్నారట. వారిద్దరు కాదనడం చేతే సిద్ధార్థ దగ్గరికి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లో ఎవరో ఒకరు తన ఈ సినిమాలు తీయాలని చూశారట భాస్కర్. కానీ ఈ సినిమా స్టోరీ ఎన్టీఆర్ కు అంతగా నచ్చకపోవడంతో తనకి సూట్ అవ్వదు అని వదిలేశాడు.

ఇక అల్లు అర్జున్ కి కథ నచ్చిన కూడా అప్పటికి తను ఎన్నో సినిమాలకు కమిట్ అవ్వడం చేత ఈ సినిమాని వదులుకున్నాడు అల్లు అర్జున్. అందుచేతనే పరుగు సినిమా తీశాడు అల్లు అర్జున్ భాస్కర్ తో కలిసి. ఇక ఈ సినిమా చివరిగా సిద్ధార్థ చేతి లోకి వెళ్లడం జరిగింది. ఇక ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే.

Share post:

Popular