పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సిపిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో జగ్గూభాయ్ అదేనండీ మన జగపతిబాబు కీలక పాత్ర పోషించబోతున్నారట.
అంతేకాదు, షూటింగ్ కూడా ఆయన జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే పలు భారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన జగ్గూభాయ్.. ఇప్పుడు ప్రభాస్ కోసం బరిలోకి దిగాడనే వార్తతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. మరి సలార్‌లో జగపతిబాబు విలన్‌గా కనిపించనున్నారా..? లేక మరేదైనా పాత్ర పోషిస్తున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది.