స్టార్ హీరోతో నయనతార సహజీవనం ..?

ఇంకొద్ది రోజుల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నున్న క్రమంలో త‌మిళ‌నాడులో ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా రాధా ర‌వి త‌న పార్టీ ప్ర‌చారంలో భాగంగా న‌య‌న‌తార‌ను లాగారు. న‌య‌న‌తార, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ తో సహ‌జీవ‌నం చేస్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఆయన. ఇది వరకు కూడా ఆయ‌న న‌య‌న‌తార ‌పై కొన్ని కామెంట్స్ చేశారు.

శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార సీత పాత్రలో నటించింది. అలాంటి వాళ్లు కూడా సీత పాత్ర లు పోషిస్తున్నార‌ని ఆయన గతంలో విమర్శలు చేశారు. ప్రస్తుతం రాధార‌వికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేప‌థ్యంలో సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి దీనిపై స్పందించింది. ఒక పార్టీ అత‌న్ని స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఎలా నియ‌మించింది. అలాంటి వారికి ఓటు వేసి మనం అధికారంలో కూర్చోపెడుతున్నాం అంటూ చిన్మ‌యి ఆయన పై ఘాటుగా కామెంట్స్ చేసింది.

Share post:

Latest