కవ్వించే కన్నెలు..క్లైమాక్స్‌ లో ట్విస్ట్ ..!

 

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కథ మొదలు పెట్టి, కవ్వించే మాటలతో ఆకట్టుకుంటారు.ఆ తరువాత అందాలు ఆరబోసి స్వర్గం చూపిస్తారు. రెచ్చగొట్టి చివరికి రచ్చ చేయిస్తారు. క్లైమాక్స్‌కి తీసుకెళ్లి పెద్ద ట్విస్ట్ ఇస్తారు కవ్వించే కన్నెలు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్‌ మేనేజర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటనలన్నీ వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా, అన్నింటికీ ఒకే లింకుంది. దీని వెనుక ఒకే ముఠా ఉంది. ఆ ఎపిసోడ్‌ ఏంటో ఇక్కడ చూద్దాం.

వీళ్లంతా సోషల్ మీడియా బాధితులే. సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడుతున్న యువకులు. అయితే, అందరూ ఒకే ముఠా బారిన పడ్డ అమాయకులు. ఇక, హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇలాంటి ఘటన నమోదయ్యింది.ఈ ముఠా వాళ్ళు వీడియోకాల్స్‌లో యువకుల్ని రెచ్చగొట్టి దుస్తులు లేకుండా చేసి, వాళ్ళకి తెలియకుండా వీడియో రికార్డ్‌ చేస్తారు. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. దీనితో కొందరు ఆత్మహత్యకి పాల్పడగా, మరి కొందరు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

 

 

 

 

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/lnYGu20QHXs” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Share post:

Latest