చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్..!?‌

క‌రోనా వైర‌స్ వల్ల ఇప్ప‌టికే చాలా మంది క‌రోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి చిన్న‌ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. బుధ‌వారం నాడు ఆయనకి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కరోనా ప‌రీక్ష చేయించుకోవ‌డంతో పాజిటివ్ అని నిర్దారణ అయిందని క‌ళ్యాణ్ దేవ్ స్వయంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. హాస్పిట‌ల్‌లో క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు తెలిపారుక‌ళ్యాణ్ దేవ్. తాను త్వ‌ర‌లోనే మ‌రింత ఆరోగ్యంగా బయటికి వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

శ్రీజ‌ను రెండో పెళ్లి చేసుకున్న క‌ళ్యాణ్ దేవ్ విజేత అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. కానీ ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర సాని అనే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతంలో మెగా ఫ్యామిలీ నుండి నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్, రామ్ చ‌ర‌ణ్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం అందరికి తెలిసిందే.