కావలిపై టీడీపీ ఫోకస్..వైసీపీ టార్గెట్‌గా లోకేష్.!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై పట్టు సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టి‌డి‌పి లోకి వలసలు పెరగడం, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి రావడం, అలాగే నారా లోకేష్ పాదయాత్ర జరగడం..ఈ అంశాలు టి‌డి‌పికి బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో నిదానంగా టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న కావలి నియోజకవర్గంలో టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే […]

నెల్లూరు రూరల్‌లో లోకేష్‌కు భారీ మద్ధతు..తొలి విజయం దిశగా.!

నెల్లూరు రూరల్ నియోజకవర్గం డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వైసీపీదే విజయం. అంతకముందు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానందరెడ్డి గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ నెల్లూరు రూరల్.. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇంతవరకు టి‌డి‌పి గెలవలేదు. అయితే టి‌డి‌పికి 2019లోనే డైరక్ట్ పోటీ చేసింది. 2009లో టి‌డి‌పి పొత్తులో భాగంగా సి‌పి‌ఐ పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. 2014లో టి‌డి‌పితో పొత్తులో […]

యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు. పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు […]

 సీమ టూ కోస్తా..లోకేష్ సత్తా చాటుతారా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టింది. సీమలో విజయవంతమైన పాదయాత్ర కోస్తాలో కూడా సక్సెస్ అవుతుందా? ఇక్కడ కూడా సత్తా చాటుతారా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే..ముందు సీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగింది. మొదట చిత్తూరులో పాదయాత్ర అనుకున్న విధంగా సాగలేదు. మొదట్లో ప్రజా స్పందన తక్కువే. కానీ నిదానంగా ప్రజా స్పందన పెరిగింది. అనంతపురంకు వెళ్ళే సరికి ఓ […]

సీమలో లోకేష్ సక్సెస్ అయినట్లేనా..టీడీపీకి 30 ప్లస్ సాధ్యమేనా?

జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టారు. కుప్పం ఎలాగో టి‌డి‌పి కంచుకోట కాబట్టి అక్కడ ప్రజా స్పందన బాగా వచ్చింది. కానీ తర్వాత అనుకున్న విధంగా రాలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో పాదయాత్ర హైలైట్ కాలేదు. ఆ తర్వాత నుంచి సీన్ మారింది. పీలేరు, నగరి, పలమనేరు లాంటి స్థానాల్లో భారీ స్థాయిలో పాదయాత్ర సక్సెస్ అయింది. అలాగే లోకేష్ అన్నీ వర్గాల […]

సీమలో లోకేష్ పెద్ద టార్గెట్..టీడీపీ రీచ్ అవుతుందా?

ఈ సారి రాయలసీమలో మంకీ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టి‌డి‌పి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని ఎన్నికల నుంచి సీమలో టి‌డి‌పి దారుణ పరాజయాలని చవిచూస్తుంది. 2014 ఎన్నికల్లో కాస్త బెటర్ ఫలితాల్ఊ వచ్చాయి గాని..వైసీపీ ఆధిక్యాన్ని అపలేకపోయింది. 2019 ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం మూటగట్టుకుంది. సీమలో ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుంటే, టి‌డి‌పి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్తితి నిదానంగా మారుతుంది. […]

ఎమ్మెల్యేలని వదలని లోకేష్..వైసీపీకి రిస్క్ పెరుగుతుందా?

యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ అనూహ్యంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టి‌డి‌పికి పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన […]

లోకేష్‌తో సీన్ చేంజ్..మంత్రికి సెగలు..ఎదురుగాలి.!

పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే..మొదట్లో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు అనుకున్న మేర రాలేదు గాని..నిదానంగా పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చిందనే చెప్పాలి. ఊహించని విధంగా ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెద్ద ఎత్తున వస్తుంది. ఆలూరు నియోజకవర్గంలో ఊహించని విధంగా ప్రజలు వచ్చారు. అంటే అక్కడ టి‌డి‌పి బలం […]

 ఉరవకొండ బరిలో పయ్యావుల..1994 రిపీట్ చేస్తారా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిఓయోజకవర్గాలు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రస్తుతం ఉరవకొండలో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ..టి‌డి‌పి అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు. కొన్ని స్థానాల్లో సీట్లు తేల్చడం లేదు గాని..మిగిలిన స్థానాల్లో పోటీ చేసేది ఎవరో తేలుస్తున్నారు. ఇటీవల రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమని, వారిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ని […]