సొంత పుత్రుడా..? దత్తత పుత్రుడా..? చంద్ర”బాబు” ఓటు ఎవ్వరికి..?

దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ప్రెసెంట్ ఆయన రాజమండ్రిలోని రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు . ఇలాంటి క్రమంలోనే .. ఏపీ రాజకీయాలలో ఎవరు ఊహించని మలుపు తిప్పుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు . టిడిపి – జనసేన ఈసారి కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతుంది అంటూ అఫీషియల్ గా మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు నాయుడు ని మీట్ అయిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..లోకేష్ – బాలకృష్ణ లను ముందు ఉంచుకొని మరి టిడిపి జనసేన కలిసి 2024 ఎలక్షన్స్ లో పాల్గొనబోతుంది అంటూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.

అంతేకాదు అసలు ఎందుకు ఆయన టిడిపి తో చేతులు కలపాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. అంతవరకు ఓకే.. అయితే ఇప్పుడు ప్రజల్లో మాత్రం సరికొత్త డౌట్ క్రియేట్ అయింది . సరే అంతా బాగుంది ..టిడిపి – జనసేన కలిసి పోటీ చేస్తుంది . ఒకవేళ ఈసారి వీళ్ళ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి నిజంగానే అధికారం చేపడితే ఏపీ సీఎం గా ఎవరు ఉండబోతున్నారు . చంద్రబాబు నా..? పవన్ కళ్యాణ్ నా..? లొకేష్ నా..?..

చాలామంది చంద్రబాబు నాయుడు అసలు ఇక బయటకు రాడు అని .. జైల్లోనే పెట్టే ప్లాన్ వేసారని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నిర్ణయం ఎటువైపుగా ఉంటుంది . సీఎంగా సొంత పుత్రుడికి ఓటు వేస్తారా..? తనను కష్ట కాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇస్తారా ..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది . దీంతో సోషల్ మీడియాలో పలువురు మీమర్‌స్ ఇదే ఇష్యుని క్యాచ్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు . సొంత పుత్రుడికి..? దత్తత పుత్రుడికి..? మధ్య నలిగిపోతున్నాడు చంద్రబాబు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!