హద్దులు దాటిన తముళ్ళు..గన్నవరంలో బూతుల పర్వం.!

ఏపీ రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ చేసుకోవడం అనేది లేదు..ఒకప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే ఉండేవి..ఇప్పుడు అవి దాటేసి.బూతుల పర్వంకు దిగారు. అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి నేతలు అదే పనిలో ఉంటున్నారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడంలో ముందున్నారు. ఎవరు తగ్గడం లేదు. తాజాగా గన్నవరంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా భారీ సభ జరిగింది.

ఈ సభలో కృష్ణా జిల్లా తమ్ముళ్ళంతా పాల్గొన్నారు. అటు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, చింతమనేని ప్రభాకర్, అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు..వేరే జిల్లాల నేతలు కూడా వచ్చారు. ఎందుకంటే గన్నవరంలో వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం కోసం టి‌డి‌పి నేతలంతా వచ్చారు. ఇక సభలో ఎవరికి వారు బూతులతో రెచ్చిపోయారు. దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బోండా ఉమా..వీరు వంశీ, కొడాలి నాని టార్గెట్ గా విరుచుకుపడ్డారు. తీవ్రంగా తిట్టారు. అలాగే ఆనాడు అసెంబ్లీలో భువనేశ్వరిని అవమానించడంపై ఫైర్ అయ్యారు.

ఇక వీరంతా ఒక ఎత్తు అయితే..అయ్యన్నపాత్రుడు మరొక ఎత్తు..ఏకంగా సి‌ఎం జగన్‌ని తీవ్ర పదజాలంతో దూషించారు. నత్తి…అంటూ దారుణంగా తిట్టారు. ఇలా టి‌డి‌పి నేతలు బూతులు మాట్లాడటంపై సొంత పార్టీ శ్రేణులే షాక్ అయ్యారు. జగన్‌ని సైతం అలా తిట్టడం సరికాదనే భావనలో ఉన్నారు. కానీ ఎవరికి వారు తిట్టడంలో పోటీ పడ్డారు.

టి‌డి‌పి నేతలు తిడితే వైసీపీ నేతలు ఖాళీగా ఉండరు కదా.. వారు ఏ స్థాయిలో కౌంటర్లు ఇస్తారో చూడాలి. టి‌డి‌పి నేతలు తిట్టి రెచ్చగొడితే వైసీపీ నేతలు తమదైన సాయిఐలో కౌంటర్లు ఇవ్వడం ఖాయం. ఇక రెండు, మూడు రోజులు నేతలు తిట్టుకునే పనిలోనే ఉంటారు.