కాంతారా -2 ఈసారి అంతకుమించి.. బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

కన్నడ హీరో రిషబ్ శెట్టి.. హీరోగా హీరోయిన్గా సప్తమి గౌడ నటించిన చిత్రం కాంతారా.. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. హోంభలే ఫిలింస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన ప్రతి ప్రాంతంలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ .20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 450 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు సాధించింది దీంతో ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలను కూడా మెప్పించింది.

Kantara 2 EXCLUSIVE: Rishab Shetty to commence shooting in November 2023;  Eyeing late 2024 release | PINKVILLA

కాంతారా సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని గతంలో ఎక్కువగా ప్రచారం జరిగింది.. రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి మాట్లాడుతూ మీరు చూసింది కాంతారా-2 కాంతారా-1 త్వరలోనే తీస్తాను అంటే ప్రకటించారు ఈ సినిమా మొదలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నది.. కాంతార ఫ్రీక్వెన్సీ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ రావడం జరిగింది..

కాంతారా సినిమా బడ్జెట్ కేవలం రూ .20 కోట్లతో తెరకెక్కించగా.. ఫ్రీక్వెల్ కి మాత్రం రూ .125 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. దసరా లేదా నవంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అలాగే వచ్చే ఏడాది కూడా సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కాంతారావు మించి హిట్ అవుతుందా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందా చూడాలి మరి.