బీజేపీలో ఆగని లొల్లి..కాంగ్రెస్ వైపే ఆ నేతల చూపు.!

తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీలోకి ఇంకా జంప్ అవ్వడానికి నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగిన విషయం తెలిసిందే.బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు పెద సంఖ్యలో కాంగ్రెస్ లోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటంతో…బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లోకి వలసలు నడుస్తున్నాయి. ఇటు బి‌జే‌పి పరిస్తితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ బలం ఊహించని […]

ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?

రానున్న ఎన్నికల్లో బి‌జే‌పి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే […]

కోమటిరెడ్డి జంపింగ్‌కు బ్రేక్? సర్దుకుంటారా?

తెలంగాణ బీజేపీలో మార్పులు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. పార్టీ రోజురోజుకూ బలహీనపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడుని మార్చేశారు. బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. బండి దూకుడుగా పనిచేసిన ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఎదురుకున్నారు. ఈ క్రమంలో బండిని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వదిలి…అధ్యక్షుడుగా చేయడం పెద్ద ఇష్టంగా లేనట్లు ఉంది. కానీ అధిష్టానం ఆదేశాలని పాటించాల్సిన పరిస్తితి. […]

కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!

కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బి‌జే‌పిలో మొదలైంది. బి‌జే‌పిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది. కానీ తెలంగాణ బి‌జే‌పిలో ఇప్పుడు ఆ పరిస్తితి […]

కమలంలో కల్లోలం..ఈటల-కోమటిరెడ్డి ఎఫెక్ట్..బండికి దెబ్బ.!

తెలంగాణ బి‌జే‌పిలో కల్లోలం కనబడుతుంది. మొన్నటివరకు దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన బి‌జే‌పి కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో కూడా చతికలపడింది. దీంతో సీన్ మారిపోయింది. ఇదే సమయంలో కమలంలో అంతర్గత పోరు తారస్థాయికి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది. మామూలుగానే తెలంగాణలో బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో పట్టు లేదు. ఉపఎన్నికల్లో గెలుపు బలమైన నాయకుల వల్ల వచ్చింది. బలమైన నాయకులు 20 లోపే ఉన్నారు..అంటే […]

కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]

పొత్తులపై పవన్ క్లారిటీ కానీ..సీఎం పదవి అందుకే?

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ, బి‌జే‌పిలతో కలిసే ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే జనసేనకు ఉన్న బలం ఏంటో ఆయనకు తెలుసు..ఆ బలంతో 10 సీట్లు గెలుచుకోవచ్చు గాని అధికారం లోకి రావడం అనేది జరిగే పని కాదు. అందుకే టి‌డి‌పి, బి‌జే‌పి మద్ధతు కావాలని అంటున్నారు. కాకపోతే ఆ మధ్య […]

కాంగ్రెస్‌లో వలసల జోరు..భారీగా క్యూలో..ఆఫర్లతో జంపింగ్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు చాలా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులోకి వచ్చింది. బి‌జే‌పిని వెనక్కి నెట్టి దూసుకొచ్చింది. పైగా బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు కీలక నేతలు చూస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కే ఛాన్స్ లేదనుకునే నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారికి మంచి ఆఫర్ ఇస్తే జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, […]

రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]