చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా….!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారా..? చిరంజీవి కామెంట్ల వెనుకున్న కోణం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోందనేది కొందరి అనుమానం. 2014 తర్వాత రాజకీయాలకు చిరంజీవి రామ్ రామ్‌ చెప్పేశారు. సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు. తమ్ముడు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నా.. తమ్ముడు రాజకీయంతో తనకేం సంబంధం లేదన్నట్టుగానే చిరంజీవి వ్యవహరించారు. వరుసగా సినిమాలు చేస్తూ… అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక 2019 తర్వాత పవన్‌ను జగన్‌.. వైసీపీ నేతలు ఎన్నెన్ని మాటలు అంటున్నా సైలెంటుగానే ఉన్నారు చిరు. అంతే […]

గన్నవరం పాలిట్రిక్స్… టీడీపీ లిస్ట్ పెద్దదే..!

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… అనూహ్యంగా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గానికి తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో సీపీఐ తరఫున గెలిచిన పుచ్చలపల్లి […]

ఈసారి అయినా.. సొంత జిల్లాలో చక్రం తిప్పుతారా….!?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలనేది మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్. అందుకోసం దాదాపు రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని కూడా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ఏడాది ముందే అధికారంలో వస్తే అమలు చేసే పథకాల జాబితాను రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ నేతలకు ఇప్పటి […]

ఆ రెండు జిల్లాలేనా పవన్ టార్గెట్…!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్. అందుకే దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీపై మాటల తూటాలు ఎక్కుపెట్టిన పవన్… అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా క్రమంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభకు పెద్ద ఎత్తు అభిమానులు వస్తున్నప్పటికీ… వారంతా ఓటర్లు మారడంలో విఫలమవుతున్నారు. దీంతో ఈ సారి మాత్రం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. గతంలో మాదిరి ఆవేశ […]

మళ్లీ ఆ ముగ్గురు కలుస్తారా… కాంబో సాధ్యం అవుతుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 కాంబినేషన్‌ రిపిట్ కానుందా… ఏపీలో తిరిగి 2014 నాటి మిత్రపక్షం అధికారంలోకి వస్తుందా… అంటే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగనప్పటికీ… టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం […]

గుడివాడ కోసం మరో కొత్త పేరు… టీడీపీలో నేతలే లేరా…?

గుడివాడ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం. అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాంటి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 2004లో టీడీపీ తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాని… తర్వాత 2009లో కూడా టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత 2012లో వైసీపీలో చేరారు. ఉప ఎన్నికతో కలిపి ఇప్పటి వరకు వరుసగా 5 […]

టీడీపీలో భయపడుతున్న నేతలు… కారణం అదేనా….!

తెలుగుదేశం పార్టీలో నేతలంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం… అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు. నిజమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అందుకు తగినట్లుగానే కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను, కార్యక్రమాలను కూడా […]

ఆసక్తికరంగా చీరాల రాజకీయం….!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం చీరాల. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నియోజకవర్గం ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనేది ఇప్పటికీ అంతు చిక్కని మాట. అక్కడ అన్ని సామాజికవర్గాలది కీలక పాత్ర. యాదవ, ఆర్యవైశ్య, కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలు గెలుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ విజయం సాధించలేదు. దీంతో ఈ సారి గెలుపు కోసం వైసీపీ, టీడీపీలు […]

ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధ్యమేనా…!

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిందే లేదు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే… అక్కడ మాత్రం పసుపు జెండా ఎగరడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు […]