ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకునే 5 దేశాలు ఇవే..!

ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఎంతోమంది త్యాగాలు, ఎన్నో మంది పోరాటాల ఫలితంగా మనకు ఇండిపెండెన్స్ డే వచ్చింది. అయితే మనతోపాటు ఆగస్టు 15న కాంగో, సౌత్ కొరియా, నార్త్ కొరియా, బహ్రెయిన్, లిచన్ స్టెన్ దేశాలు సైతం స్వతంత్రం పొందాయి.

కంగో:
రిపబ్లిక్ ఆఫ్ కాంగోను కాంగో బ్రెజవిల్లేగా కూడా పిలుస్తారు. ఈ దేశం 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ దేశం నుంచి స్వాతంత్రం పొందింది.

నార్త్ కొరియా, సౌత్ కొరియా:
1945 ఆగస్టు 15న కొరియన్ పెనిన్సులా జవాన్ దేశం నుంచి స్వతంత్రం పొందింది. అనంతరం రెండు దేశాలుగా విడిపోయింది. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఆగస్టు 15న స్వాతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాయి.

లిచ్టెన్ స్టెన్:
ఇది ఒక చిన్న దేశం. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్యలో ఈ దేశం ఉంది. ఈ దేశం జర్మన్ పాలన నుంచి 1866 ఆగస్ట్ 15న స్వాతంత్రం పొందింది‌. అయితే 1940 ఆగస్టు 15 వరకు ఈ దేశానికి స్వతంత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

బహ్రెయిన్:
పెర్షియన్ గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ బ్రిటిష్ పాలన నుంచి 1971 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందింది‌. ప్రతి దేశానికి సాంస్కృతికంగా , భౌగోళికంగా ప్రత్యేకత‌ ఉంది. పైన తెలిపిన 5 దేశాలు, భారతదేశంలో ఆగస్టు 15న స్వాతంత్రం దినోత్సవాన్ని ఎంతో గౌరవంతో జరుపుకుంటారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరులవల్ల నేటి తరం ముందుకు సాగుతుంది.