రాముడు… రాముడే… రామూ నోటీ నుంచి సూక్తి ముక్తావళి..!

అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్‌ గోపాల్‌ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ […]

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే పట్టించుకోకపోతే ఎలా…!?

ఓటర్ల జాబితాలో అవకతవకలపై రోడ్డెక్కిన టీడీపీ.. అవకాశం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది. మొదటి నాలుగు రోజులు ఇంటింటి తనిఖీలు అంటూ హడావుడి చేసిన క్యాడర్‌.. ప్రస్తుతం అటువైపు కూడా వెళ్లడం లేదు. ఇంచార్జ్‌ల అలసత్వమే అందుకు కారణమవుతోందనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం సాగుతోంది. బూత్ లెవల్ ఏజెంట్‌లతో టీడీపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదు. ఓటర్ల జాబితా పరిశీలపై ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ […]

వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు…!

ఓ వైపు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు జగన్. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రివ్యూ సమావేశంలో నేతలకు పలు సూచనలు కూడా చేశారు. 9 నెలలు కష్టపడితే… పార్టీకి, మీకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని నియోజకవర్గాలు పార్టీని ఇబ్బంది […]

గిల్లింతే గిల్లించుకోవాల్సిందే… తప్పదు కదా…!

మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్లను ఉద్దేశించి కౌంటర్‌ ఇస్తూ ప్రకాష్‌ రాజ్‌ పోకిరి సినిమాలో చెప్పిన డైలాగును ప్రస్తావించారు. గిల్లితే గిల్లించుకోవాల్సిందే అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో గిల్లితే తిరిగి గిల్లుతారు అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. కరెక్టే.. పేర్ని నాని చెప్పింది కరెక్టే.. గిల్లితే తిరిగి గిల్లాల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పెట్టారనే వివాదాన్ని మనస్సులో పెట్టుకుని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల […]

పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!

పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా […]

వంగవీటి రాధా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా….?

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రాధా. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రాధా. ఎన్నికల్లో రాధాకు టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే హామీ కూడా నాలుగేళ్లుగా అమలు […]

బాబాయ్ – అబ్బాయ్ మధ్య చిచ్చు పెడుతున్న మంత్రి పదవి…!

రాజకీయాల్లో తమదే పై చెయ్యిగా ఉండాలనేది నేతల ఆలోచన. తమ రాజకీయ వారసులు తెరపైకి వచ్చినప్పటికీ… వారు కూడా తమ చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తారు. తమ మాట కాదని ముందుకు వెళితే మాత్రం… సొంత కుటుంబ సభ్యులను కూడా వదులుకునేందుకు రాజకీయవేత్తలు వెనుకాడరనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలెత్తుతోంది. సిక్కోలు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కింజరాపు కుటుంబంలో ఇప్పుడు ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. […]

నరసరావుపేట ఎంపీ టీకెట్ కోసం కొత్త పేరు…!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల కంటే కూడా… లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనే విషయం పైనే ఎక్కువగా చర్చ నడుస్తోందని చెప్పాలి. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఓడిన వారిలో చాలా మంది పార్టీలు మారడం, నియోజకవర్గం మార్పు అంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. […]

సత్తెనపల్లి టీడీపీ ఓ దారికి వచ్చినట్లేనా….!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. 2014లో అక్కడ పోటీ చేసి గెలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయితే 2019లో మరోసారి పోటీ చేసిన కోడెల శివప్రసాద రావు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతిలో ఓడారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం […]