‘ శంకర వరప్రసాద్ గారు ‘ లో చిరు – వెంకి ఫైట్స్ పై అనిల్ క్లారిటీ..!

టాలీవుడ్ లేటెస్ట్ ప్రస్తుతం నయా ట్రెండ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన స్టార్ హీరోలు సైతం ఇటీవల కొత్త కంటెంట్ ఎంచుకుంటూ ఒక్క సినిమాతోనే వైవిధ్యమైన సొంతం చేసేసుకుంటున్నారు.. ఇక మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఆడియన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక.. ప్రస్తుతం చిరు.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా పనులు బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక చిరంజీవితో పాటు.. మరో సీనియ‌ర్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం సినిమాలో మెరవనున్నాడు. ఇన్ని సంవత్సరాల ఇద్దరు సినీ కెరీర్‌లో ఒక్కసారి కూడా కలిసి నటించింది లేదు. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. అంతేకాదు.. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి వీళ్లిద్దరిని కలిపి సినిమా నటింపజేయడం మరింత విశేషం.

ఇక సినిమాతో కచ్చితంగా చిరంజీవి కలెక్షన్లు వర్షం కురిపిస్తాడని.. బాక్సాఫీస్లు బ్లాక్ చేస్తాడని థీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు.. చిరంజీవి, వెంకటేష్ మధ్య ఫైట్ సీన్ కూడా ఉంటుందంటూ వార్తలు తెగ వైరాలవుతున్నాయి. త్రిబుల్ ఆర్ లో చరణ్, తారక్ మధ్యలో ఎంత వైల్డ్ ఫైట్ సీన్స్ ఉన్నాయో చూసాం. అదే రేంజ్లో ఈ సినిమాలను ఫైట్ సీన్స్ ఉంటాయని వార్తలు వినిపించాయి. అయితే.. అంత వైల్డ్ ఫైట్స్ ఉండకపోయినా.. చిన్న ఫైటింగ్ ఎపిసోడ్ అయితే ఉంటుందని.. డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫైట్ సీన్స్ ఆడియన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేస్తాయో.. వెంకటేష్, చిరు ఫ్యాన్స్ ఈ సన్నివేశాలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.