ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్‌ప్రభాస్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకుంటూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా రాణిస్తున్న ఆయన.. బాహుబలి ఫ్రాంఛైజ్ నుంచి మొదలుకొని.. చివరిగా వచ్చిన కల్కి వరకు తన సినిమాలతో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ సినిమాలకు మధ్యలో ఎంతో మంది దర్శకులతోను పనిచేశాడు. పూరి జగనాధ్ లాంటి సీనియర్ డైరెక్టర్‌తో ఏక్ నిరంజన్ మొదలుకొని.. నాగశ్విన్ కల్కి 2898 ఏడి వరకు.. చాలా రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ప్రస్తుతం హను రాఘవపూడి తో పనిచేస్తున్నాడు. గతంలో సుజిత్ తోను చేశాడు. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగతోను పనిచేస్తున్నాడు. ఇక ప్రస్తుతం రాజాసాబ్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లోనే మొదటిసారి హారర్ కామెడీ థ్రిల్లర్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక.. నిన్న రాత్రి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ ని యాంకర్ సుమ తన దర్శకులకు ట్యాగ్లు ఇవ్వాలని కోరింది. ఒకే ఒక్క మాటలో తన దర్శకుల గురించి చెప్పాలని సుమ అడగడంతో.. ప్రభాస్ రియాక్ట్ అవుతూ ఒక్కొక్కరికి ఒక్క క్రేజీ ట్యాగ్‌ను ఇచ్చేసాడు నాగ అశ్విన్ – స్ట్రాంగ్ డైరెక్టర్, ప్రశాంత్ నీల్ – బ్యూటిఫుల్ పర్సన్, రాజమౌళి – జీనియస్, మారుతి – క్యూట్, హనురాగపూడి – హార్డ్ వర్కింగ్, సుజిత్ – వెరీ స్మార్ట్, పూరి – జీనియస్ అంటూ ట్యాగ్లను జత చేశాడు. ఇక సందీప్ వంగ గురించి చెప్తూ.. కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్ అంటూ ప్రశంసించాడు. పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా పొందుతున్న సందీప్ స్పిరిట్ సినిమా సెట్స్ నుంచి నేరుగా ది రాజాసాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ స్టార్ డైరెక్టర్లకు ఇచ్చిన ఈ ట్యాగ్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి.

