కామనర్‌గా వచ్చి సెకండ్ రనరప్ గా డిమోన్.. మొత్తం ఎంత గెలుచుకున్నాడో తెలుసా..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి అగ్నిపరీక్ష ద్వారా కామ‌న‌ర్స్‌గా అడుగుపెట్టి కంటెస్టెంట్లు అందరిలోనూ టాప్ 5 వరకు నిలిచి డిమాన్‌ పవన్, ప‌వ‌న్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశారు. అంతటితో వీళ్ళ సక్సెస్ ఆగలేదు. వీళ్ళిద్దరూ టైటిల్ విన్నింగ్ కి అన్ని విధాలుగా అర్హతను దక్కించుకున్నారు. చాలా కష్టాలు ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి హౌస్ లోకి వచ్చినా.. ఎప్పుడు తన కుటుంబంలోని కష్టాలను ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను షేర్ చేసుకుని సానుభూతి కోసం ప్రయత్నించలేదు. తన గేమ్‌తో 100% ఎఫ‌ర్ట్స్ ఇచ్చి.. ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.

Bigg Boss 9 Telugu : విన్నర్ ప్రైజ్ మనీకి కోతపెట్టిన డీమాన్.. రూ.15 లక్షల  సూట్ కేస్‏తో బయటకు.. - Telugu News | Bigg Boss 9 Telugu Grand Finale Demon  Pavan Eliminated With rs 15 Lakhs Suitcase ...

గత సీజన్‌, ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ లాగా రైతుబిడ్డ, ఆర్మీ అనే ట్యాగ్స్ ఏమి లేకున్నా.. ఎలాంటి ప్రొఫెషన్ మెన్షన్ చేయకున్నా.. బిగ్బాస్ హిస్టరీలో పిఆర్ టీం లేకుండా టాప్ 5లోకి రావడం అందులోను టాప్ 3 వరకు వచ్చి సక్సెస్ అందుకున్న ఏకైక కంటెస్టెంట్ డిమాన్ మాత్రమే. లవ్ ట్రాక్ కారణంగా ఇతని గేమ్ చాలా వరకు వెనుకబడిపోయినా.. రీతు ఎలిమినేషన్ తర్వాత గేమ్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. టాస్క్ లో ఎలాగూ 100% ఇచ్చి పడేసే పవన్.. ఎంటర్టైన్మెంట్ లోను గత రెండు వారాలుగా కింగ్ గా నిలిచాడు. ఇమ్మానియేల్ ని సైతం డామినేట్ చేసే రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అందుకే.. మూడవ‌ పొజిషన్‌లో ఉన్న ఇమ్మును వెనక్కునేటి డిమాన్‌.. ఆ పోజిషన్ ద‌క్కించుకున్నాడు.

ఇక మొదటివారం నుంచి డిమాన్‌ ఆట ఇలానే కంటిన్యూ అయి ఉంటే మాత్రం.. కచ్చితంగా కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఓటింగ్‌తో నెంబర్ 1 స్థానాన్ని కొట్టేసేవాడంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే.. కొంతమంది రివ్యూస్ పేరుతో డిమాన్‌ను తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే.. డిమాన్‌ ఎలాగో గెలవడు.. ఐదవ‌ స్థానంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అతని అభిమానులు ఓట్లు వృధా చేయకుండా పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేస్తే కామనర్‌గా పవన్ కళ్యాణ్ అయినా గెలుస్తాడు అంటూ అనవసరమైన వీడియోస్ చేసి మరి రిలీజ్ చేశారు. అయినా.. ఆడియన్స్ రియల్ టాలెంట్ ఎంకరేజ్ చేశారు. డిమాన్‌ పవన్‌కు 3వ‌ స్థానాన్ని కట్టబెట్టారు.

Bigg Boss 9 Demon Pavan: 'ఉద్యోగం వదిలి అథ్లెటిక్స్‌ ఆపై బిగ్​బాస్​లోకి' -  ఈ కామనర్​ గురించి తెలుసా?

టాప్ 3 కంటెంట్ హౌస్ లో ఉండగా మాస్ మహారాజు రవితేజ రూ.15 లక్షల సూట్కేస్ తో హౌస్ లోకి వెళ్ళాడు. డిమాన్ ఆ సూట్‌కేస్‌ను స్వీకరించి బయటకు వచ్చేసాడు. డిమాన్‌కు ఆ రూ.15 లక్షల కూడా తక్కువే అనడంలో అతిశయోక్తి లేదు. హౌస్ లో ఎంతగానో కష్టపడ్డాడు. గొడ్డుచాకిరీ, ఫిజికల్ టాస్కులు, ఎంటర్టైన్మెంట్.. తనతో తలపడడం అంటే ఎవరికైనా వణుకు పుట్టేంతగా ఆటతీరుతో మెప్పించాడు. ఇలా ఒకటా, రెండా పవన్ రియల్ హీరో అనిపించుకోవడానికి తన 100% కష్టాన్ని పెట్టేసాడు. ఇక రెమ్యూనరేషన్ కూడా దాదాపు రూ.25 లక్షల పైగా వచ్చిందట. ఈ క్రమంలోనే పవన్ ఇప్పటివరకు హౌస్ నుంచి రూ.40 లక్షలు సొంతం చేసుకున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక భవిష్యత్తులో డిమాన్‌ ఎలాంటి సక్సెస్ను అందుకోబోతున్నాడో చూడాలి.