NBK 111 టైటిల్ లీక్.. బాలయ్య సినిమాకు ఇంత రొటీన్ టైటిలా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లతో సీనియర్ హీరోలలో ఎవ్వరు చూడనంత సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆయన నుంచి వచ్చిన మూవీ అఖండ 2 తాండవం.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కానీ.. అక్కడక్కడ లాజిక్ లెస్ అంటూ నెగిటివ్ కామెంట్స్ కారణంగా వర్కింగ్ డేస్‌లో కలెక్షన్స్ మెల్లమెల్లగా డౌన్ అయిపోతున్నాయి.

NBK111 (2026) - IMDb

ఇక అఖండ విషయం పక్కన పెడితే.. బాలయ్య తన నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మలినేనితో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా వచ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. కేవలం కమర్షియల్ సక్సెస్ కాదు.. బాల‌య్య‌ నటవిశ్వరూపాన్ని బయటకు తీసిన సినిమా ఇది. ముఖ్యంగా గోపీచంద్ పెద్ద బాలయ్యను చూపించిన విధానం ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం ఫిదా చేసింది. అలాంటి ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది.ఇక నిన్న మొన్న‌టివ‌ర‌కు కమర్షియల్ సినిమాలకు పరిమితమైన గోపీచంద్.. ఈసారి పీరియాడిక్ జానర్‌లో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజుల కాలం నాటి కథగా.. ఇది తెరకెక్కనుంది. ఇందులో రాణి పాత్రలో హీరోయిన్‌గా నయనతార మెరవనుంది.

Nayanthara joins NBK 111 as queen in Gopichand Malineni's period drama with  Nandamuri Balakrishna - India Today

గతంలో.. ఆమె బాలయ్యతో కలిసి నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నా.. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య తో నయ‌న్ తెర‌పై క‌నిపించ‌నుంది. కాగా.. ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వ‌ర్గాల్లో టాక్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాకు.. ఎంత సింపుల్ టైటిల్ పెట్టడం పై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. మహారాజ్‌కు బదులు సింహ అని వచ్చేటట్టు వేరే ఏదైనా పవర్ ఫుల్ టైటిల్ పెడితే బాగుంటుందని.. మహారాజ్ అనేది చాలా రొటీన్, వీక్ టైటిల్ గా అనిపిస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి గోపీచంద్.. అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని టైటిల్ డిసైడ్ చేస్తాడో.. లేదో.. చూడాలి.