టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించారు టీం. దీంట్లో భాగంగానే.. నవంబర్ 14 (నేడు) సాయంత్రం 5 గం..కు సినిమాల్లో ఫస్ట్ సాంగ్ ముంబైలో లాంచ్ చేయనున్నారు. దీనికోసం ఓ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్న క్రమంలో.. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. ముంబైలోని పివిఆర్జి బీచ్ లో ఆఖండ 2 తాండవం రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ ఈవెంట్లో బాలయ్యతో పాటు.. బోయపాటి శ్రీను, ఇతర టీం మొత్తం ఈ ప్రోగ్రాంకు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే.. బాలయ్య బిఇగ్ మిస్టేక్ చేసాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. పాటను రిలీజ్ చేసే టైం కు నెక్స్ట్ డే రాజమౌళి, మహేష్ మూవీ నుంచి అప్డేట్ కూడా రిలీజ్ కానుంది. రాజమౌళి నుంచి అప్డేట్ అంటే ఏ రేంజ్ లో హైప్ నెలకొంటుందో తెలిసిందే. దేశ విదేశాల నుంచి కూడా మూవీ గురించి ఆరాలు మొదలెడతారు. సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. కానీ.. బాలయ్య సినిమా విషయంలో మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. కనీసం.. సినిమా క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా జరగడం లేదు.
ఇక అఖండ 2 నుంచి తాండవం అనే ఓ సాంగ్ వస్తుందని కూడా చాలామందికి తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే.. అఖండ 2 విషయంలో.. రాజమౌళి సినిమా టైం కు చాలా ముందుగా సాంగ్ గురించి అనౌన్స్మెంట్ చేసి ఉండాల్సింది.. లేదంటే కంప్లీట్ అయిన తర్వాత సాంగ్ వదిలి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను దృష్టిలో పెట్టుకోకుండా.. బాలయ్య బిగ్ మిస్టేక్ చేసాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అయితే.. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఆయన రూటే సపరేట్.. పాట ఏ రేంజ్ లో ఉంటుందో.. ఊహకు కూడా అందదు. కచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

