అనిల్ నెక్స్ట్.. కత్తిలాంటి హీరోను లైన్లో పెట్టిన హిట్ మిషన్.. ఈసారి బొమ్మ బ్లాస్టే..!

ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఓ సినిమా తరుకెక్కి సక్సెస్ అందుకోవాలంటే సినిమా స్టోరీ తో పాటు.. డైరెక్షన్, యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ.. ఈ మూడు అంశాల్ని సరైన లెవెల్ లో బ్యాలెన్స్ చేస్తూ వచ్చే వ్యక్తి ఎవరంటే మాత్రం దర్శకుడు అనే చెప్పాలి. ఇక టాలీవుడ్‌లో అలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లలో.. అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఎనర్జీ అన్నింటిని సమపాళ్లలో చూపిస్తూ అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాడు. తన.. ప్రతి ఒక్క‌ కంటెంట్‌ను ఆడియన్స్‌కు కనెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. హిట్ మెషిన్ అనే మార్క్‌ కూడా క్రియేట్ చేసుకున్నాడు అనిల్‌.

Chiranjeevi to play Shankar Vara Prasad in Anil Ravipudi's film, script  locked - India Today

యూత్ నుంచి.. ఫామిలీ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకునే కంటెంట్ ఎంచుకుంటూ అతి తక్కువ బడ్జెట్ తో వేగంగా సినిమాలను తీసి పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ ఇస్తున్నాడు. అందుకే.. అనిల్ రావిపూడి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయంటే మొదటి నుంచి హంగామా మొదలైపోతుంది. ఇక ప్రస్తుతం అనిల్.. మెగాస్టార్ చిరంజీవితో భారీ ప్రాజెక్టును ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అదే మన శంకర వరప్రసాద్ గారు మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక.. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాను.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని గతంలోని అఫీషియల్ గా ప్రకటించాడు. ఈ సినిమా తర్వాత.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది.. మెగాస్టార్ లాంటి స్టార్ హీరో తర్వాత అనిల్‌ ఎలాంటి హీరోతో సినిమా చేయబోతున్నాడు అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.

అనిల్ రావిపూడి, రామ్ పోతినేని మధ్య గొడవ? | director anil ravipudi and hero ram  pothineni between clashes - Telugu Oneindia

అయితే.. మొదట ఈ లిస్టులో అక్కినేని నాగార్జున పేరు వినిపించిన అదంతా ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక.. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా కోసం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ని ఫైనల్ చేశాడట. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోపై ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. ఇక వీళ్లిద్దరి కాంబోలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌ రూపొంద‌నుందని.. అనిల్ మార్ కామెడీ పంచ్‌లను మేళవించి సినిమా తెర‌కెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేసారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకువచ్చే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి.. మరోసారి తన సత్తా చాటుకుంటాడా.. లేదా.. ఈ సినిమాతో రామ్‌కు అనిల్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు వేచి చూడాలి.