చిరు సినిమాకు నయన్ షాకింగ్ కండిషన్స్.. మేక‌ర్స్‌కు చుక్కలు చూపిస్తుందిగా..!

సౌత్ ఇండియాన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల రేంజ్‌లో అమ్ముడు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని దూసుకుపోతుంది.నాలుగు పదుల వయసులోను.. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా వరస ప్రాజెక్టులలో బిజీబిజీగా గడుపుతుంది. ఇక అమ్మడు ఈ రేంజ్‌ సక్సెస్ అందుకోవడానికి కారణం గ్లామర్ మాత్రమే కాదు.. నటన, కథ ఎంచుకునే విధానం, స్క్రీన్ ప్రజెన్స్‌లో సైతం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే. ఇక చాలాకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓ సినిమాకు సైన్‌ చేసింది. అదే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు.

Mana Shankara Varaprasad Garu (Mega 157) 2026 | Mana Shankara Varaprasad  Garu Telugu Movie: Release Date, Cast, Story, Ott, Review, Trailer, Photos,  Videos, Box Office Collection – Filmibeat

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్‌లో అమ్మడు మెర‌వ‌నుంది. షైన్‌ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం స‌ర‌వేగంగా షూట్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా బ‌చ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సినిమాలో నటించేందుకు నయన్‌ పెట్టిన కండిషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా కోసం నయనతార ఏకంగా రూ.10 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిందట.

Nayanthara in chiranjeevi anil ravipudi movie team officially annouced with  special video mega157 movie updates | Nayanthara: సంక్రాంతికి  రఫ్పాడించేద్దాం - మెగాస్టార్, అనిల్ మూవీలో నయనతార ...

తన జర్నీ ఖ‌ర్చులు, స్టే చేయడానికి అవసరమయ్యే వసతి.. అలాగే పర్సనల్ స్టాప్ ఖర్చులను కూడా మేకర్స్ భరించాల్సి ఉంటుందని వివరించిందట. ఇవన్నీ అగ్రిమెంట్లు బాగాంగానే అంటే నిర్మాతలకు ఈ భారం తప్పదు. కానీ ప్రస్తుతం నయనకు ఉన్న డిమాండ్ రిత్యా ప్రొడ్యూసర్స్ దానికి కూడా ఒప్పుకున్నారట. ఇలాంటి క్రమంలో తాజాగా నయన్‌.. సినిమాలో ఓ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్‌లో సందడి చేసింది. ఒంటరిగా కాదు.. ఆమెతో పాటు.. తన ఫ్యామిలీ మొత్తాన్ని.. అలాగే ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి కేర్ టేకర్లను కూడా నయన్‌.. తన వెంట తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటింట‌ వైరల్‌గా మారుతుంది. అయితే.. మొదట్లో ప్రొడ్యూసర్ ఈ డిమాండ్లకు ఒప్పుకున్నా.. ఈ రేంజ్‌లో భారా బడ్జెట్‌తో చుక్కలు చూపిస్తుందని వాళ్ళు భావించి ఉండరు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.