గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఫ్యాన్స్‌లోనే కాదు.. సాధారణ ఆడియన్స్‌లోను మంచి హైప్ నెలకొంది. ఇక.. దానికి తగ్గట్టుగానే రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం భారీ రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. ఇక సిగ్నేచర్ షాట్స్ అయితే ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి.
క్రికెట్ లో ఇలాంటి షాట్స్‌కూడా ఆడతారా అంటూ ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ఆడే ప్రయత్నాలు చేసే రేంజ్‌లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో.. పెద్ది మూవీలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఫుల్ ఫిల్ చేశాడట బుచ్చిబాబు. వాటిలో ఐటమ్ సాంగ్ కూడా ఒకటని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్‌కి.. బ్లాక్ బస్టర్ రేంజ్లో రెహమాన్ ట్యూన్స్ కూడా ఇచ్చేశాడట. ఆయనలోని వింటేజ్ మార్క్ ఈ ఐటెం సాంగ్ తో క్లియర్గా కనిపిస్తుందని టాక్ నడుస్తుంది.
ఇక ఈ సినిమాలో చరణ్‌తో.. ఓ హాట్ బ్యూటీ చిందేయనుందట. అయితే.. ఆమె ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. కాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎక్కువగా మృణాల్ ఠాగూర్ పేరు వినిపిస్తోంది. అయితే.. మరి కొంత మంది మాత్రం శ్రద్ధా కపూర్ అయ్యుండొచ్చు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్ సరసన మెరవనున్న ఆ హాట్ బ్యూటీ ఎవరో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మృనాల్ ఠాగూర్ చాలా వరకు ఫిక్స్ అయిపోయిందట. ఒకవేళ ఇదే వాస్తవమైతే.. సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరి పర్ఫామెన్స్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.