మెగా 157.. చిరు పై ఫ్లాష్ బ్యాక్.. వెంకీ రోల్ కూడా..!

టాలీవుడ్ సీనియ‌ర్‌ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 ర‌నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న‌ ఈ సినిమా.. గ‌తంలో సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాడు అనిల్. అనిల్ సినిమా అంటే ఏ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెట్స్‌ పైకి రాకమందు నుంచి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రకరకాల స్ట్రాటజీలను వాడుతూ తన సినిమాను ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లో ఆశ‌క్తొ పెంచేస్తూ ఉంటాడు అనిల్. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఏదో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అలా.. తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.

సినిమా సెకండ్ హాఫ్‌లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు.. ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని.. కచ్చితంగా దీనికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అని సీన్స్ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. వీటన్నింటికీ తగ్గట్లుగా చిరంజీవి పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్‌ను అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో మెగాస్టార్ పాత్ర మాఫియా బ్యాగ్రౌండ్‌తో ఉండ‌నుందని సమాచారం. అంతేకాదు.. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాల్లో మెగాస్టార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే వెంకట్ కూడా కనిపించనున్నాడట.

Chiranjeevi and Venkatesh Team Up in Mega 157 | cinejosh.com

ఇక ఇటీవల మెగాస్టార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా ఫుల్ ఆఫ్ ఎంట్ర‌టైన‌ర్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కథ తనకు ఎంతగానో నచ్చేసిందని.. నేను సినిమా చేసేందుకు ఎంతో ఎగ్జిక్టెడ్ గా ఉన్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఆ సన్నివేశాల గురించి అనిల్ చెప్తుంటే నాకు కడుపుబ్బా నవ్వొచ్చిందని.. అంతగా నేను ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని.. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని మెగాస్టార్ వివరించాడు. ఇక ఈ సినిమాను సాహో గారపాటి, సుస్మిత కొణిదెల‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. బిమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.