బాలయ్య అఖండ 2లో స్పెషల్ సాంగ్.. బోయపాటి మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం.. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. మరోసారి బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరూ కాంబోలో తెర‌కెక్కిన మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బ‌స్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడం.. అది కూడా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Balakrishna, Boyapati Srinu to collaborate again; film to be launched on  Oct 16

దానికి తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్ గా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య కోసం బోయపాటి అదిరిపోయే ప్లాన్ వేసాడట. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభమవుతుందని.. సాంగ్ షూట్ పూర్తయిన తర్వాత బాలయ్య షాట్స్‌.. ఈ సాంగ్‌లో యాడ్ చేయనున్నట్లు సమాచారం. ఇక 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్ పై.. రామ అచ్చంట, గోపి ఆచ్చంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్. ఎస్. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

Akhanda 2 teaser out: Nandamuri Balakrishna's action saga set for September  release - India Today

ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సంచ‌ల‌నం సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు టీం. ఈ సినిమాల్లో గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా మెర‌వ‌నుంది. యంగ్ హీరో ఆది పిన్నిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖండ 2 తాండవం కోసం బాలయ్య అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ అయ్యిన త‌ర్వాత ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.