ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు.. అన్ని సినిమాలు ముందు చెప్పిన రిలీజ్ డేట్ కాకుండా వాయిదా పడుతూ మరో రిలీజ్ డేట్ కు రిలీజ్ కావడం శుద్ధ కామన్ అయిపోయింది. ఇక.. ఈ విషయంలో హరిహర వీరమల్లు డజనుసార్లు వాయిదా పడి మొదటి వరుసలో ఉంటే.. దీనికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ గట్టి పోటీ ఇస్తుంది. ఇక ముందుగా ఈ సినిమా మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు అది కూడా పోయి జూలై 25న రిలీజ్కు ఫిక్స్ అయింది. కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఆరిలీజ్ డేట్ కూడా మార్చేశారట. ఎందుకంటే వీరమల్లు రిలీజ్ జూలై 24న ఉండడంతో.. రెండు సినిమాలకు క్లాష్ వచ్చే అవకాశం ఉంది. దీంతో.. రెండు సినిమాలు నష్టపోతాయి.
ఈ క్రమంలోనే రెండు సినిమాల రిలీజ్ డేట్ వాయిదాల విషయంలో పోటీ నెలకొంది. సినిమాల కంటే ఓటిటి సంస్థల మధ్య పోటీ అనడం సరిగ్గా ఉంటుందేమో. ప్రస్తుతం కింగ్డమ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో జులై 25న సినిమాను రిలీజ్ చేయాలని నెట్ఫ్లిక్స్ బలంగా డిమాండ్ చేస్తుంది. ఇక ముందనుకున్న డేట్ ను వాయిదా వేస్తే మాత్రం కచ్చితంగా రైట్స్ కి అనుకున్న ధరలో కోతలు విధిస్తామని వార్నింగ్ ఇస్తున్నారట. ఇక మరోపక్క అమెజాన్ ప్రైమ్ సంస్థ డీల్ తో వీరమల్లు పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఏడాదిలో మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మూడు సార్లు అమెజాన్ ప్రైమ్ నిర్మాతలకు అనుకూలంగా వ్యవహరించిన.. నాలుగోసారి ససేమీరానో చెప్పేసిందిట.
జూలై 24న మూవీ రిలీజ్ చేయాలని.. లేదంటే డీల్ రైట్స్ ఒప్పందంలో కోతలు తప్పవంటూ క్లారిటీ ఇచ్చిందట. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కింగ్డమ్ సినిమా వెనుకడుగు వేసిందని.. ఆగస్టు 7 కు వాయిదా పడడానికి సంస్థ ఒప్పుకుందని తెలుస్తుంది. ఇందుకు నిర్మాత నాగవంశీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరమల్లు టీం జులై 24న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ లైన్ క్లియర్ అయినట్టే. వీరమల్లు సినిమా జులై 24న రావడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నిజంగానే కింగ్డమ్ ఆగస్ట్కు వాయిదా పడిందా.. లేదా.. తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే.