హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. కానీ ప్రైమ్ కరుణిస్తేనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని.. అడ్డంకులన్నీ దాటుకొని జూన్ 12న రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో వారం రోజుల‌య‌లో పవర్ స్టార్ సినిమాతో.. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా వేరే లెవెల్ లో ఉండేది. ఈ క్రమంలోనే.. జూన్ 3న సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ సెన్సార్ కార్యక్రమాలకు కూడా పంపించారు. కరెక్ట్‌గా అదే సమయానికి ఇరాన్‌ నుంచి కాల్ రావడం.. సెకండ్ హాఫ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉందని రెండరింగ్ సమస్యలు ఉన్నాయని.. మరో వారం రోజులు సమయం పడుతుందని తెలియడంతో అప్పటికప్పుడే సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట.

ఈ క్రమంలోనే అభిమన్యులను నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే రాష్ట్రంలో ప్రతి చోట బ్యానర్స్‌ని ఏర్పాటు చేసి.. కొన్నిచోట్ల థియేటర్ల ముందు బ్యానర్లు కూడా కట్టి.. భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవాలని డబ్బులు జమ చేస్తున్న అభిమానులకు.. సినిమా వాయిదా పడడం బ్యాడ్ న్యూస్ గా మారింది. పవన్ ఏపి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత రానున్న మొదటి సినిమా కావడంతో.. సెలబ్రేషన్స్‌ను వేరే లెవెల్‌లో ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్. కానీ.. చివరకు సినిమా రిలీజ్ కావడం లేదని తెలిసి బాధపడుతున్నారు. కొత్త విడుదల తేదీ ఎప్పుడు.. అసలు ఆ సినిమా వాయిదా వేయాల్సిన అవసరం ఏముందనే దానిపై మేకర్స్‌ మాత్రం అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఈ నెల 12 లోపు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్లు టాక్.

ఎందుకంటే ఇరాన్‌ నుంచి రావాల్సిన విఎఫ్ఎక్స్‌ వరకు మాత్రం జూన్ 10న పూర్తస్థాయిలో వస్తుందట. అదే రోజున థియేటర్ని కూడా కట్ చేయనున్నారట. ప్రస్తుతం నిర్మాత.. ఏ.ఎం.రత్నం మదిలో రెండు రిలీజ్ డేట్‌లు మెదులుతున్నాయని.. బయ్యర్స్ మాత్రం వేరొక రిలీజ్ డేట్ ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 26న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కారణం అమెజాన్ ప్రైమ్ తో పెట్టుకున్న డీల్ ప్రకారం నెలలోనే సినిమా రిలీజ్ చేయాలి. కానీ.. జూన్ 21న క‌న‌ప్ప సినిమా రిలీజ్ అవుతుంది. వాళ్లతో నిర్మాతను సంప్రదించగా.. వాయిదా వేయడం కుదరదని చెప్పేసారట. మేము ఈ డేట్ ను ప్రకటించి దాదాపు 3 నెలలు అవుతుంది. కోట్ల రూపాయల్లో ఇప్పుడు నష్టం జరుగుతుంది.

మా రిలీజ్ డేట్‌కు అనుకూలంగా మీరే మరొక విడుదల తేదీని చూసుకోండి అని వాళ్లు వివరించారట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా జులై 4న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు వర్క్ బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో.. తమ సినిమాను ఆ రోజునే రిలీజ్ చేసుకోవచ్చు. క‌న‌ప్ప టీం కుదరదని మొండిపట్టు వేయడంతో.. వీరమల్లు టీం అమెజాన్ ప్రైమ్ తో మాట్లాడి జూన్ 4న సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఈ రెండు తేదీలలో వీర‌మల్లు సినిమా ఎప్పుడు రానుందో అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.