వార్ 2: తారక్, హృతిక్, కియార రెమ్యునరేషన్ లెక్కలివే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ వార్ 2.. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్‌కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఏ చిన్న‌ అప్డేట్ వచ్చినా.. నెటింట అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక మే 20 తార‌క్‌ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు హృతిక్ అఫీషియల్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అంతే కాదు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెలబ్రిటీల రెమ్యూనరేషన్ లెక్కలు సైతం వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. ఒకసారి తెలుసుకుందాం. య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా స్పై యూనివర్స్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరోసారి కబీర్ పాత్రలో మెరువనున్నారు. ఇక ఈ సినిమా కోసం హృతిక్‌కు రూ.48 కోట్ల రెమ్యున‌రేషన్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే.. సౌత్ ఇండియన్ స్టార్ హీరో.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి బాలీవుడ్ మూవీ వార్ 2.

War 2' में कियारा आडवाणी की एंट्री!

ఇక ఈ సినిమా కోసం తారక్ రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కియారా అద్వానీ.. రూ.15 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్‌ చేసింది. వార్ 2లో షబ్బీర్ అహ్లూ వాలియా కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈయన రూ.30 నుంచి రూ.35 లక్షల రెమ్యూనరేషన్ చార్జ్‌ చేశాడట. అలాగే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అయాన్ ముఖర్జీ.. రూ.32 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్‌ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. వార్ 2లో జాన్ అబ్రహం స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. ఆయన ఈ స్పెషల్ రోల్ కోసం రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.