మ్యూజిక్ డైరెక్ట‌ర్ దెబ్బ‌కు నిర్మాత‌ల మైండ్ బ్లాక్‌..!

ప్రస్తుతం మాట్లాడుతున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పటికే మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఆ సాంగ్స్ సినిమాలకు ప్లస్ అవుతున్నాయి. మ్యూజికల్ హిట్లుగా నిలుస్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్నా రాను.. రాను.. ఆ స‌క్స‌స్‌ను మరింత పిక్స్‌కు తీసుకుని బలంగా పెట్టేసుకుంటున్నాడు. దీంతో ఇటీవల తమ సినిమా కోసం వచ్చిన ఓ నిర్మాతకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోడ్‌ చేసిన ఫిగర్‌కు నిర్మాత‌ మైండ్ బ్లాక్ అయిందట. ఓ మంచి కాంబినేషన్ లో సినిమా కోసం మ్యూజిక్ అందించాలని అడిగితే.. తప్పకుండా అని చెప్తూనే రెమ్యునరేషన్ జ‌స్ట్ తొమ్మిది కోట్లు అని చెప్ప‌డంతో కంగుతిన్న ప్రొడ్యూసర్.. ఏం చేయాలో తెలియని డైలమాలో పడిపోయాడట.

ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతూ క్షణం తీరిక‌లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్నా మ్యూజిక్ దర్శకులలో థ‌మన్, రెహమాన్ లాంటివారే రూ.8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పరిస్థితి. ఇక దేవి శ్రీ రూ.10 కోట్లు, అనిరుధ్ రూ.15 కోట్లు ఛార్జ్ చేస్తుంటే.. నిన్న కాక మొన్న వచ్చిన ఈ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ అడగటం ఆశ్చర్యమే కదా. ఏదో నాలుగు, ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్లు అయి చేతిలో ఉన్నాయో.. లేదో.. ఇంకా ఆడియో రైట్స్ కు అద్భుతమైన బిజినెస్ వచ్చేసే అంత రేంజ్ అయితే లేదు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు.

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ లాంటి క్రెజీ కాంబో మూవీ దసరా కే రూ.18 కోట్ల ఆడియో రైట్స్ రావడం చాలా కష్టతరమైంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు సైతం ఆడియో రైట్స్ ఈ రేంజ్ లో ఉంటుంటే.. ఇప్పుడే వచ్చిన అప్ క‌మింగ్ డైరెక్టర్ కు రూ.9 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి..? ఈ కుర్రాడు ఇప్పటికే తన వైఖరితో ఒక్కొక్కరికి మెల్లమెల్లగా దూరమవుతూ వస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ముందుముందు ఇదే వైఖ‌రి కొన‌సాగిస్తే.. కెరీర్ పోవ‌డం ఖాయం అంటూ.. ఇక్కడ వర్క్ ఉంటే సరిపోదు.. సినిమా బడ్జెట్ కు అందుబాటులో ఉండాలి.. ఎంత టాలెంట్ ఉన్నా దానిని తలకెక్కించుకొని నోటికి వచ్చినంత డిమాండ్ చేస్తే వర్కౌట్ కాదంటూ.. అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.