బాలయ్య – కొరటాల మూవీ పిక్స్.. నిర్మాత ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, హీరోయిన్‌లుగా, దర్శకులుగా ఎరిగిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోతో మరో డైరెక్టర్ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందని.. లేదా ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ల కాంబోలో సినిమా వస్తే బాగుంటుందంటూ ఇలా రకరకాల డ్రీమ్ కాంబోస్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కామెడీ సీన్స్ టాలీవుడ్ లోనూ ఎన్నో ఉన్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో కూడా ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఎంతోమంది ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ కాంబో ఫిక్స్ అయింది.

ఇన్నాళ్ల తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్‌లో సినిమా సెట్స్‌ పైకి వచ్చింది. అలాగే టాలీవుడ్‌లో ఎంతోమంది ఎదురు చూసే మరో క్రెజియస్ట్‌ కాంబోలో బాలకృష్ణ – కొరటాల శివది కూడా ఒకటి. ప్రస్తుతం బాలయ్య తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటు రాజకీయాల్లోనూ.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక కొరటాల శివ.. ఆచార్యతో ఎదురు దెబ్బ తగిలినా దేవరతో స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ ఇచ్చి ప్రస్తుతం ఫామ్ లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య, కొరటాల కాంబోలో మూవీ సెట్స్‌పైకి వెళ్ళనుందని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమాకు సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నాడట.

On Koratala Siva's birthday, a streaming guide to his movies | Telugu News  - The Indian Express

కొరటాల శివ.. ఆచార్య సినిమాకు ముందు వరకు అన్ని హిట్ సినిమాలు రూపొందించారు. మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ చరణ్ లాంటి క్రేజీ కాంబినేషన్లో కొరటాలు తెర‌కెక్కించిన ఆచార్య పెద్ద డిజాస్టర్ కావడంతో కొరటాలకు పెద్ద నష్టమే వచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడంతో దేవర రూపొందించి మరోసారి తన సత్తా చాటుకున్నాడు కొరటాల. ఇలాంటి నేపథ్యంలో సితార బ్యానర్ పై నాగవంశీ.. బాలయ్య , కొరటాల కాంబోలో ప్రాజెక్టును సెట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడట. ఇది సెట్స్‌పైకి వస్తే మాత్రం కచ్చితంగా ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.