రెండో భర్తను పోలీసులకు అప్ప‌గించి.. మూడో పెళ్లికి ముస్తాబ‌వుతున్న‌ స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ సుద్ద‌ కామన్. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లైన 2 , 3 ఏళ్ళ‌కు విడాకులు తీసుకుంటుంటే.. మరి కొంతమంది పెళ్ళి 20,30 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా విడాకులతో దూరమవుతున్నారు. అలా మరి కొంతమంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తాజాగా.. ఇప్పుడా లిస్టులోకి మరో హీరోయిన్ యాడ్ అయిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ అమ్మడు ఇండియాలో కాదు, పాకిస్తాన్‌లో తన మూడవ వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

'Rakhi Sawant is coronavirus', says ex-husband Adil Khan Durrani

అయితే ఈ అమ్మడు ఇప్పటివరకు జరిగిన రెండు పెళ్ళిళ్ళు కూడా పెద్ద దుమారమే. రెండో భర్త పై కేసు పెట్టి అరెస్ట్ చేయించి పోలీసులకు అప్పగించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంటున్నా అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం నెటింట‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇనీ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం.. అది కూడా బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో సుద్ధ కామన్. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమైన ఈ బ్యూటీ కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మే కావడం విశేషం. ఇక బాలీవుడ్ హాట్ బాంబ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. వివాదాలకు క్యారాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. రాఖీ సావంత్.

Rakhi Sawant To Get Married For The Third Time? Says 'Shadi Pakistan Mein  Hogi' To A Police Officer Named...

ఈ అమ్మ‌డు హీరోయిన్గా పలు సినిమాలో నటించి మెప్పించింది. తర్వాత వైవిధ్యమైన కామెంట్లతో కాంట్రవర్సీల్లో చిక్కుకొని పాపులర్ అయింది. ఇక హిందీ బిగ్‌బాస్‌లోను సందడి చేసిన రాఖి.. మొహబత్ హై మిర్చి నుంచి దేక్త హైతూ క్యా వరకు ఎన్నో స్పెషల్ సాంగ్ లలో కనిపించి ఆకట్టుకుంది. పలు రియాలిటీ షోల‌లోను మెరిసింది. కాగా ఈ అమ్మ‌డి వ్యక్తిగత విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. రాఖీకి ఇప్పటికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట వ్యాపారవేత్త రితీష్‌ను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత మరో వ్యక్తిని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి ఆదిల్ ఖాన్‌ దుర్బాని వివాహం చేసుకున్న ఈమె.. ఎక్కువ కాలం అతనితో కాపురం చేయలేదు. అతను మానసికంగా, వేధించాడని.. కొట్టాడని.. ఆరోపణలు చేసి పోలీసులకు అప్పగించింది. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమైంది. పాకిస్తాన్ కు చెందిన నటుడు, నిర్మాత అయిన డాడీ ఖాన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. రాఖీ సావంత్ పెళ్లి పాకిస్తాన్ లో, రిసెప్షన్ ఇండియాలో, హనీమూన్ స్విట్జర్లాండ్ లేదా నెదర్‌ల్యాండ్లో జరగనున్నట్లు వివరించింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.