తెలుగింటి ఆడపడుచు సావిత్రి.. మహానటిగా ఎనలేని కీర్తిని సంపాదించుకుంది. పురుషాధిక్యతతో కూడిన ఇండస్ట్రీలో.. స్టార్ హీరోలను డామినేట్ చేసి తనదైన ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన సావిత్రి.. ఒక దశలో వారి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, కొండమ్మ లాంటి ఆల్ టైం క్లాసికల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సావిత్రి.. తన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఓ సందర్భంలో సావిత్రి తమ సినిమాలో ఉంటే చాలని దర్శక నిర్మాతలు భావించే రేంజ్‌కు ఎదిగింది. ఆమె డేట్స్ కోసం పెద్దపెద్ద స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవారు. ఈ క్రమంలోనే పేరుతో పాటు.. సావిత్రి అంతులేని సంపాద కూడబెట్టారు.
అలాంటి క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు, నమ్మిన వాళ్లు చేసిన మోసాలు, ఇబ్బందులతో చాలావరకు కోల్పోయింది. చివరి రోజుల్లో సావిత్రి దుర్భర జీవితాన్ని అనుభవించింది. ఈ క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి.. అనారోగ్య కారణంతో దాదాపు 19 నెలలు కోమాలో ఉన్న సావిత్రి.. 1981 డిసెంబర్ 26న తనువు చాలించింది. సావిత్రి అంత్యక్రియలకు టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఎంతోమంది పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇందులో భాగమయ్యారు. అయితే నందమూరి తారక రామారావు అంత్యక్రియలకు వెళ్ళలేకపోయాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో.. సావిత్రి అంత్యక్రియలకు వెళ్ళలేకపోయిన రామారావు.. తన తరఫున ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను అక్కడికి పంపించాడు.
ఆ విధంగా ఈ జనరేషన్ హీరోల్లో బాలకృష్ణ మాత్రమే సావిత్రి అంత్యక్రియలో పాల్గొన్నారు. ఇక చిరు కెరీర్ బిగినింగ్ లో చేసిన ఒకటి రెండు సినిమాల్లో సావిత్రి గారు కనిపించారు. అప్పటికే సావిత్రికి స్టార్డం నెమ్మదించింది. సావిత్రితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం చిరంజీవి పొందారు కానీ.. చిరంజీవి బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె అంత్యక్రియలకు వెళ్ళలేకపోయారు. సావిత్రి జీవిత కథను డైరెక్టర్ నాగ అస్విన్ మహానటి టైటిల్‌తో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ కనిపించగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కీర్తి సురేష్ నటనకు నేషనల్ అవార్డు దక్కింది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు సైతం ఈ సినిమాలో భాగమయ్యారు.