వాళ్ళని చూస్తే జాలేస్తుంది.. మీ నిజ స్వరూపం ఇదే.. జానీ మాస్టర్ సెన్సేషనల్ ట్విట్..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ఓ కేసు నెగ్గింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై.. జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. దానిపై సంచలన ట్విట్ చేశాడు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని.. వారిని చూస్తే జాలేస్తుంది.. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును వారికి అనుకూలంగా మార్చుకొని నచ్చినట్లుగా మరోకేస్‌తో ముడి పెట్టుకుని పోస్టులు షేర్ చేస్తున్నారు.

Jani Master - Jhansi : జానీ మాస్టర్ కేసులో ఝాన్సీ కామెంట్స్.. రెండు వారాలుగా ఈ ఇష్యూ మా పరిశీలనలో ఉంది.. | Anchor jhansi comments on jani master case in press meet-10TV Telugu

మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారా.. కానీ అసలు తీర్పు వచ్చిన రోజున మీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది. దేనికోసం ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారో అర్థమవుతుంది.. ఆరోజు దగ్గరలోనే ఉంది.. న్యాయమే గెలుస్తుంది అంటూ జానీ మాస్టర్ తన ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం నటి ఝాన్సీ, జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అంటూ ఓ పోస్ట్‌ని షేర్ చేసుకుంది.

వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తర్వాత.. ఫిలిం చాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్‌పై ఫిలిం ఛాంబర్ కేసు నెగ్గిందని జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్‌ను కోర్టు తోసిపుచ్చిందంటూ వెల్లడించింది. దీన్నిబట్టి వర్క్ ప్లేస్‌లో మహిళలకు రక్షణ ఎంత ముఖ్యమనేది కోర్ట్ ప్రూవ్ చేసిందని.. అలాగే ప్రతి సంస్థలో పోష్‌ రూల్స్ ఉండాలని మరోసారి రుజువైందంటూ ఝాన్సీ చెప్పుకొచ్చింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంపై ఫెడరేషన్‌తో కలిసి పోరాడుతున్నందుకు ధన్యవాదాలు అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఝాన్సీ పోస్ట్ పై జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.