నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డం సంపాదించుకుంది. ఇప్పటివరకు నిర్మాతలను ఇబ్బంది పెట్టని ఏకైక స్టార్ హీరోయిన్గా రీజనబుల్ రెమ్యూనరేషన్‌ను కోరుకునే హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తండేల్ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగా భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. ఇది ఆమె కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటూ సమాచారం. సినిమా సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈమె లాభాల కంటే కంటెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కొన్ని సినిమాల రిజల్ట్‌ని బట్టి రెమ్యూనరేషన్ కూడా వదలకుంది. అలాంటి సాయి పల్లవి 2018 లో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా కోసం మొదట అనుకున్నా రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు వినిపించాయి. ఇప్పుడు తండేల్ సినిమా భారీ ప్రాజెక్ట్ నేపథ్యంలో.. ఆమె మార్కెట్కు తగినట్లుగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. అయితే సాయి పల్లవి హీరోయిన్‌గా సక్సెస్ సాధించడానికి ఆమె కెరీర్‌లో ఎంచుకున్న పాత్రలే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటించిన అమరాన్ సినిమాలోని తన పాత్రకు మంచి ప్రసంసలు దక్కాయి. సినిమా ప్రేక్షకుల నుంచి భారీ ఓపెనింగ్స్ రావడానికి సాయి పల్లవి కూడా ఓ ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే రానున్న తండేల్ సినిమాకు కూడా ఆమె ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొలిపింది. చందు మండేటి డైరెక్షన్‌లల గీత ఆర్ట్స్ టు బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు భారి డిమాండ్ ఏర్పడింది. ఇక సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ కు కూడా మంచి స్కోప్ ఉందని సమాచారం. ఆమె పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవడం తోపాటు.. సినిమాలో న్యాచురల్ గా కనిపించేందుకు మరింత కష్టపడిందని టాక్.. ఇలాంటి క్రమంలో సాయి పల్లవి రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ను చార్జ్ చేసిందని సమాచారం. ఇక సాయి పల్లవి రెమ్యూనరేషన్ కూడా సినిమా మార్కెట్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్ళనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తండేల్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఆమె కెరీర్‌లో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.