నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న గడియలు రానే వచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న టీం.. సెట్స్ పైకి త్వరలోనే సినిమాను తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీ అయ్యారట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో జోడి కట్టబోయే హీరోయిన్ సెలక్షన్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ డబ్ల్యూ మూవీని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే బాలయ్య కూడా తన కొడుకు ఎంట్రీ గురించి అఫీషియల్ గా కొన్ని సందర్భాల్లో వివరించాడు. దీంతో ఫ్యాన్స్‌లో మరింత జోష్ మొదలైంది. మోక్షజ్ఞ తేజ ఫోటోషూట్ రిలీజ్ తర్వాత.. ఈ సినిమాపై అంచనాలు అంతకందుకు పెరుగుతూ వచ్చాయి. నందమూరి వారసుడికి కావాల్సిన అన్ని హంగులు ఆయన సింగిల్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు. మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక నందమూరి నటవారసుడితో జోడి కోసం ఎంతో మందిని లుక్ టెస్ట్ చేశారట మేకర్స్. అయితే శ్రీలీలతో పాటు.. చాలా మంది అమ్మాయిల పేర్లు తెరపైకి వచ్చినా.. చివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుమార్తెను మోక్షజ్ఞ కోసం ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తుంది.
ఇప్పటికే ఈ అమ్మాయి హిందీలో ఓ సినిమా చేసి తన నటనతో ప్రేక్షకులు మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో.. విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. మోక్షజ్ఞకు జంటగా నటించబోయే ఆ అమ్మాయి బాలీవుడ్ స్టార్ బ్యూటీ రవినా టండన్, నిర్మాత తడాని కుమార్తె రషా తాడని అన్ని టాక్ నడుస్తుంది. అధికారికంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేయకున్నా.. సెలెక్ట్ చేయడం దాదాపు ఫిక్స్ అని.. సరైన సమయం చూసి అఫీషియల్ గా ప్రకటించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక రవినా టండన్, తడానిలా కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆజాది సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో హీరోగా ఆమన్ దేవగణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకులేదు.