టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఏకంగా రూ.1900 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే.. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. దానికి కారణం సంధ్య థియేటర్ ఘటన. ఈ ఇష్యూలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఎకరోజు జైల్లో కూడా గడిపేలా చేశారు. పాన్ ఇండియా స్థాయిలో అంతటి సక్సెస్ ఉన్న.. ఓ హీరోకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. అయితే బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీని కూడా ఈ ఇష్యూ బాగా కుంగదీసింది. మానసికంగా ఇబ్బంది పడేలా చేసింది.
దీంతో బన్నీ దాని నుంచి బయటపడడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుని రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో నెక్స్ట్ సినిమాపై అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ.. వారికి డిసప్పాయింట్మెంట్ ఎదురయింది. బన్నీ ఇప్పుడు వెంటనే సినిమా చేయడానికి ఇష్టపడడం లేదని.. కొంత గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు కేసు, కోర్టు, పోలీస్ స్టేషన్ లంటూ వివాదాలు చుట్టు నడిచిన అల్లు అర్జున్.. కొంతకాలం ఏకాంతంగా కుటుంబంతో గడపాలని.. వెకేషన్లు ప్లాన్ చేసుకుంటున్నాడట. లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకొని పూర్తిగా టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని.. వారితో రిలాక్స్ అవ్వాలని ఫుల్ ఎనర్జిటిక్‌గా రెట్టింపు ఉత్సాహంతో మరోసారి షూట్‌లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
ఈ లెక్కన.. దాదాపు 5-6 నెలల వరకు సినిమాలకు బన్నీ దూరంగానే ఉంటాడని తెలుస్తుంది. ఇక వెకేషన్లు అన్ని పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాపై బన్నీ ఫోకస్ చేయనున్నాడట. ప్రస్తుతం ఎవరితో సినిమా చేసిన బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే ఒప్పుకుంటున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ అయిందని.. సోషల్, మైథాలజికల్, ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అయితే.. స్క్రిప్ట్‌లో బన్నీ కొన్ని మార్పులు, చేర్పులు వివరించాడని.. దానిపై త్రివిక్రమ్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ గ్యాప్ లో తను రిలాక్స్ కాబోతున్నాడట. అనంతరం ఈ ఏడాది ద్వితీయ అర్థం నుంచి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక త్రివిక్రమ్ – బన్నీ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.