దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుక్కుమారున్ విలన్ గా నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. దీనిపై తాజాగా పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. నాకంటే మీకే.. అంటే మీడియాకు చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏది స్పష్టత లేదు. చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఫైనల్ అయ్యాక దాని గురించి మాట్లాడతా అంటూ ఆయన వెల్లడించారు. అనంతరం దీనిపై రియాక్ట్ అయ్యారు.
ఈ సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చిన ఆయన.. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక సలార్ 2 ప్రారంభం అవుతుందంటూ వెల్లడించారు. సలార్ వల్ల ప్రభాస్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పిన పృథ్వీరాజ్.. ప్రభాస్‌కు ఉన్న స్టార్డం ఆయనకు తెలియట్లేదని.. నాకు తెలిసినంతవరకు ఆయన సోషల్ మీడియాని కూడా ఉపయోగించడు. ఓ ప్రైవేట్ పర్సన్.. అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడంటూ వెల్లడించారు.
ఇక ఎస్ఎంబి 29 దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస యాత్రగా.. అడవి నేపథ్యంలో సాగే కథతో సినిమా తెరకెక్కనుంది. గత ఏడాది చివరిలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్ ఈ సినిమా షూట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుందని సమాచారం. ఇక సినిమా నుంచి ఎలాంటి లీక్‌లు లేకుండా.. మూవీ టీం పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. మహేష్, ప్రియాంక మినహా ఇందులో నటించే ఇతర కాస్టింగ్ వివరాలు ఏవి బయటకు రివిల్ కాలేదు. మరోపక్క నటీనటులతో పాటు సినిమాకు సంబంధించిన ప్రతి టీం మెంబెర్ తో నాన్ డిస్క్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లుగా ఇంగ్లీష్ ఛానల్ లో వార్తలు వినిపించాయి.